ENGLISH

పాపం స్నేహకి ఎందుకీ పాట్లు.!

17 March 2018-15:29 PM

సోషల్‌మీడియా వచ్చాక పబ్లిసిటీకి ఆకాశమే హద్దయ్యింది. ఎందుకు, ఏమిటి, ఎలా..? అనే కారణాలు లేవు. ఏదోలా పబ్లిసిటీ స్టంట్‌ చేయడం ఓ సరదా అయిపోయింది. తాజాగా ముద్దుగుమ్మ స్నేహ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ దిగిన ఫోటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

సోషల్‌ మీడియాకి ఎక్కామంటే, ఏదో పెద్ద ఫలింతం ఆశించే అనే ఓ ప్రచారం కూడా ఉంది. అయితే ఆ లెక్కల్లో స్నేహ ఆశిస్తున్న ఆ పెద్ద ఫలితం ఏంటటా..! ఆల్రెడీ హీరోయిన్‌గా పలు సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో నటించేసింది. తమిళ హీరో ప్రసన్నని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా కూడా సెటిలైపోయింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తోంది. అయితే అమలాపాల్‌, సమంతల మాదిరిగా హీరోయిన్‌గా కాదులెండి. కానీ ఫిజిక్‌, అందం విషయంలో స్నేహలో పెళ్లి తర్వాత పెద్దగా మార్పులేమీ వచ్చింది లేదు. 

అలాంటప్పుడు పాపం కొత్తగా ఈ వర్కవుట్స్‌ చేసి  అలసిపోవడమెందుకు స్నేహ అంటూ, సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఈ మధ్య బుల్లితెరపై ఓ డాన్స్‌ షోకి జడ్జ్‌గా వ్యవహరించడంతో బుల్లితెర సరదా కూడా తీరిపోయింది ఈ ముద్దుగుమ్మకి. అయితే కొత్తగా ఇంకేం కావాలనో ఈ పబ్లిసిటీ మరి. అంటే, స్నేహ ప్రధాన పాత్రలో సౌత్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందట. ఆ సినిమా కోసమే ఈ వర్కవుట్స్‌ అని సమాచారమ్‌. 

మరో పక్క ఇప్పటికే ఈ భామ తెలుగులో చరణ్‌ - బోయపాటి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించే అవకాశం ఎలాగూ దక్కించుకుంది. గతంలో మెగా కాంపౌండ్‌ హీరో అల్లు అర్జున్‌ నటించిన 'సన్నాఫ్‌ సత్యమూర్తి' సినిమాలో నటించింది.

ALSO READ: ‘చరణ్’ అంటే ఎక్కువ అంటున్న హీరో