ENGLISH

ఆఖ‌రికి శ్రీ‌రెడ్డిని కూడా వ‌ద‌ల‌డం లేదా?

01 January 2020-19:31 PM

కాదేదీ ప్ర‌చారానికి అన‌ర్హం అని న‌మ్ముతుంది చిత్ర‌సీమ‌. ఎవ‌రు లైమ్ లైట్‌లో ఉంటేవాళ్ల‌ని వాడేసుకుంటారు. బ‌ర్నింగ్ టాపిక్కుల‌తో సినిమాలు తీస్తారు. ప‌నిక‌ట్టుకుని వివాదాల్ని సృష్టిస్తారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నుంచి క‌త్తి మ‌హేష్ వ‌ర‌కూ ఎవ‌ర్నీ వ‌ద‌లిపెట్ట‌రు. ఆఖరికి శ్రీ‌రెడ్డి పేరు కూడా వాడేసుకుంటున్నారు. `శ్రీ‌రెడ్డి దొరికిపోయింది` అనే పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఆర్య‌న్‌, ఉపాస‌న జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ ప‌ర‌మ‌హంస ద‌ర్శ‌కుడు. శ్రీ‌రెడ్డి అంటే ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? టాలీవుడ్ సెల‌బ్రెటీలంద‌రినీ త‌న మాట‌తో, ట్వీట్ల‌తో ఏకి ప‌డేసిన శ్రీ‌రెడ్డి గుర్తుకు వ‌స్తుంది.

 

అయితే ఈ సినిమా క‌థ‌కూ, శ్రీ‌రెడ్డికీ ఎలాంటి సంబంధం లేద‌ట‌. హీరోయిన్ పేరు శ్రీ‌రెడ్డి అని, త‌ను మాన‌వ మృగాల‌కు దొరికిపోవ‌డమే ఈ సినిమా క‌థ అని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. మ‌రి శ్రీ‌రెడ్డి పేరు వాడుకున్నందుకు ఆమె ఒప్పుకుంటుందా, లేదంటే గొడ‌వ‌కు దిగుతుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఏదేమైనా జ‌నంలోకి వెళ్లే టైటిల్‌ని మాత్రం ప‌ట్టుకోవ‌డంలో చిత్ర‌బృందం స‌క్సెస్ అయ్యింద‌నే చెప్పాలి.

ALSO READ: 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌' మూవీ రివ్యూ & రేటింగ్!