ENGLISH

శ్రీ‌దేవి కుమార్తెని రంగంలోకి దింపుతున్నారా?

11 October 2020-12:30 PM

రాఘ‌వేంద్ర‌రావు `పెళ్లి సంద‌డి`తో మ‌రో మ్యాజిక్ చేయ‌బోతున్నారు. త‌న కొత్త సినిమా ప్రాజెక్టుని ద‌ర్శ‌కేంద్రుడు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `పెళ్లి సంద‌డి` సినిమాతో రాబోతున్నాన‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. అయితే హీరో ఎవ‌రు? హీరోయిన్ ఎవ‌రు? అనే విష‌యాలు చెప్ప‌లేదు. త్వ‌ర‌లోనే వాళ్ల వివ‌రాలు బ‌య‌ట‌పెడ‌తాన‌న్నారు. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ ఈ సినిమాలో హీరోగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

 

`పెళ్లి సంద‌డి` శ్రీ‌కాంత్ ని స్టార్ గా మార్చేసింది. ఆ సినిమా సీక్వెల్ లో శ్రీ‌కాంత్ వారసుడు న‌టించడం నిజంగా ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం. ఇప్పుడు హీరోయిన్ పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. క‌థానాయిక‌గా శ్రీ‌దేవి త‌న‌య ఖుషీ క‌పూర్ ని ఎంచుకోవాల‌ని చూస్తున్నార్ట‌. ఖుషీ వ‌స్తే.. ఈ ప్రాజెక్టుకి కొత్త క‌ళ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే కీర‌వాణి స్వరాలు అందించే ప‌నిలో ప‌డిపోయారు.న‌టీన‌టుల‌కు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

ALSO READ: ప‌వ‌న్ మ‌రీ 'అడ్వాన్స్‌' అయిపోతున్నాడు.