ENGLISH

త‌మ‌న్నాకు క‌రోనా

04 October 2020-13:39 PM

క‌రోనా సెల‌బ్రెటీల చుట్టూ తిరుగుతోంది. ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. సినిమా వాళ్లూ క‌రోనా బారీన ప‌డుతున్నారు. తాజాగా త‌మ‌న్నా కూడా ఈ జాబితాలో చేరిపోయింది. త‌మ‌న్నాకు క‌రోనా పాజిటీవ్ గా నిర్దార‌ణ అయ్యింది. ప్ర‌స్తుతం ఓ షూటింగ్ నిమిత్తం హైద‌రాబాద్ వ‌చ్చింది త‌మ‌న్నా. తాను వ‌చ్చేట‌ప్ప‌టికీ జ్వ‌రంతో బాధ‌ప‌డుతోంద‌ట‌. ఎందుకైనా మంచిద‌ని కోవిడ్ టెస్ట్ చేయిస్తే పాజిటీవ్ అని తేలింది. దాంతో... హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరిపోయింది. త‌మ‌న్నా త‌ల్లిదండ్రుల‌కు ఇది వ‌ర‌కే క‌రోనా వ‌చ్చింది. వాళ్ల కోలుకున్నారు కూడా. ఇప్పుడు త‌మ‌న్నాకూ కోవిడ్ సోకిన‌ట్టైంది.

ప్ర‌స్తుతం `సిటీమార్‌`లో న‌టిస్తోంది త‌మ‌న్నా. గోపీచంద్ క‌థానాయ‌కుడు. ఈ సినిమా షూటింగ్ కోస‌మ‌నే త‌మ‌న్నా హైద‌రాబాద్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడు త‌మ‌న్నాకి క‌రోనా సోక‌డంతో... షూటింగ్ వాయిదా వేయాల్సివ‌స్తోంది.

ALSO READ: క్వారెంటైన్‌లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌?