ENGLISH

థియేటర్లు ఓపెన్‌.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

02 October 2020-10:37 AM

సినిమా థియేటర్లు అక్టోబర్‌ 15 నుంచి ఓపెన్‌ అవబోతున్నాయన్న వార్త సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏడు నెలల విరామం తర్వాత ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు ఎలా వెళతాడు? అన్న ప్రశ్న కూడా సినీ వర్గాల్ని వెంటాడుతోంది. కేంద్రం అన్‌లాక్‌ 5 మార్గదర్శకాల నేపథ్యంలో సినిమా థియేటర్లను 50 శాతం కెపాసిటీతో తెరిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే. దాంతో, దసరా రిలీజ్‌లకు మార్గం సుగమం అయ్యింది.

 

కానీ, ఇప్పటికే ఓటీటీ విడుదలలు నవంబర్‌ నెలకి కూడా కన్‌ఫామ్ అయిపోయి వున్నాయి. అవి మళ్ళీ థియేటర్ల వైపు వస్తాయా.? లేదా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. థియేటర్లు ఓపెన్‌ అయినా, ప్రేక్షకుల్ని థియేటర్లకి రప్పించడం ఇప్పుడు అతి పెద్ద సవాల్‌గా మారింది సినీ పరిశ్రమకి. గతంలో రోజుల తరబడి, వారాల తరబడి సినిమాలు థియేటర్లలో నడిచేవి. కానీ, ట్రెండ్‌ మారిపోయింది.. శుక్ర, శని, ఆదివారాల్లో వచ్చే వసూళ్ళపైనే ఆశలు చిత్ర నిర్మాతలకి. దాంతో, థియేటర్లు ఫుల్‌ అయితే తప్ప నిర్మాతకి డబ్బులు మిగలవు.

 

దీనికి తోడు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయి గనుక అది ఇంకో తంటా. ఎలా చూసినా సినిమా కష్టాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. పైగా, కొత్త కష్టాలు మొదలవుతాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్‌లు, మెయిన్‌టెనెన్స్‌లు కొత్త తలనొప్పిగా మారతాయి. సరైన వసూళ్ళు లేనప్పుడు అది నిర్వహణ భారమే అవుతుంది కదా.! సినీ పరిశ్రమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటే తప్ప.. సినిమా బతికే పరిస్థితి లేదు.

ALSO READ: 'నిశ్శబ్దం' మూవీ రివ్యూ & రేటింగ్!