ENGLISH

క‌రోనా గండం.. మ‌రో పెద్ద సినిమా వాయిదా

07 January 2022-10:20 AM

క‌రోనా ఈసంక్రాంతితో ఆడుకుంటోంది. ఈ సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాల‌న్నీ వ‌రుస‌గా వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌, రాధే శ్యామ్ చిత్రాలను నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తూ, నిర్మాత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్పుడు మ‌రో భారీ సినిమా కూడా వెన‌క్కి వెళ్లిపోయింది. అజిత్ న‌టించిన `వలిమై` కూడా వాయిదాల బారీన ప‌డింది. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే ఈ రోజు ఈ సినిమాని వాయిదా వేస్తూ చిత్ర‌బృందం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

 

ఈమేర‌కు నిర్మాత బోనీ క‌పూర్ ట్వీట్ చేశారు. ''చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూతబడుతూ వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా థియేటర్లను మూసివేయాలనే నిర్ణయం జరిగిపోవడంతో, ఈ సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు.మా సినిమాను మీరు థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయలేము త్వరలో పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమాను విడుదల చేస్తాం. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తాం'' అని ప్ర‌క‌టించారు.

ALSO READ: నాగార్జున‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు