ENGLISH

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ - వర్మ చెప్పాలనుకున్నది చెప్పేశాడు

27 September 2017-11:51 AM

ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్‌ని పట్టుకుని సినిమా తీస్తానంటూ సెన్సేషన్‌ సృష్టిస్తూ ఉంటాడు సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ. ప్రస్తుతం మన సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సెన్సేషనల్‌ సబ్జెక్ట్‌ ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర. అయితే ఎన్టీఆర్‌ జీవిత చరిత్రని లక్ష్మీ పార్వతి యాంగిల్‌ నుండి తెరకెక్కించనున్నట్లుగా రామ్‌ గోపాల్‌ వర్మ ప్రకటించి, హాట్‌ టాపిక్‌గా వార్తలో నిలిచాడు. బయోపిక్స్‌ విషయంలో వర్మ ఎప్పుడూ ఇలాగే ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ ఊహించే స్థాయిలో కన్నా, అంతకు మించిన స్థాయిలో ఊహించడమే వర్మ స్పెషాలిటీ. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను తెరకెక్కించే యోచనలో ఆల్రెడీ బాలయ్య రంగం సిద్ధం చేస్తున్న తరుణంలో వర్మ లేట్‌గా అయినా లేటెస్టుగా వచ్చి, లక్ష్మీ పార్వతి యాంగిల్‌లోనుండి ఎన్టీఆర్‌ బయోపిక్‌ని తీస్తానని ప్రకటించడం పట్ల ఎన్టీఆర్‌ అభిమానుల్లో అలజడి మొదలైంది. అయినా అక్కడున్నది వర్మ కదా. అలజడి రేపడమే వర్మకలవాటు. అయితే ఈ బయోపిక్‌లో వర్మ ఏం చూపించబోతున్నాడనేదే సర్వత్రా ఆశక్తి. లక్ష్మీపార్వతిని మెయిన్‌ ఎలిమెంట్‌గా ఎంచుకున్నాడంటే, ఆమెనే ఈ సినిమాకి మెయిన్‌ హీరో చేస్తాడేమో! లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎంటర్‌ అయిన దగ్గర్నుంచీ, ఎన్టీఆర్‌ జీవితంలో వచ్చిన పరిణామాలను, ఆయన చివరి దశలో జరిగిన పరిణామాలు ఇలాంటి అంశాల్ని తన సినిమాలో చూపించనున్నారు వర్మ అని తెలియవస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వర్మ రిలీజ్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ మరిన్ని సంచలనాలకు వేదికైంది. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా వచ్చే ఏడాది చివరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడట వర్మ.

ALSO READ: http://telugu.iqlikmovies.com/viewnews/salman-khan-to-become-father-via-surrogacy/3416