ENGLISH

హాట్‌ హాట్‌ బికినీ భామ 'నచ్చిందిలే'

20 April 2018-08:00 AM

గంపెడు ఆశలతో, భారీ అంచనాలతో 'మనసుకు నచ్చింది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ముద్దుగుమ్మ అమైరాదస్తూర్‌. ఇదే ఈ ముద్దుగుమ్మకి తొలి తెలుగు సినిమా. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నమోదు చేసింది. కానీ విడుదలయ్యాక తుస్సుమనిపించింది. దాంతో ఎంట్రీలోనే చుక్కెదురైందీ భామకి. సినిమాల సంగతి పక్కన పెడితే, సోషల్‌ మీడియాలో మాత్రం అమ్మడు హైపర్‌ యాక్టివ్‌ అని చెప్పాలి. హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో విచ్చలవిడిగా అందాలారబోసేస్తూ, కెమెరాకి పోజులిచ్చేస్తూ ఉంటుందీ భామ. అందులో భాగంగానే ఈ బికినీ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మండుటెండలో, స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన రొమాంటిక్‌ బ్లూ బికినీలో హాయిగా సేద తీరుతూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేసేస్తోంది. 'మనసుకు నచ్చింది' నిరాశపరిచినా, నెక్ట్స్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో 'రాజుగాడు' చిత్రం ద్వారా త్వరలోనే మళ్లీ పలకరించనుంది హాట్‌ అండ్‌ క్యూట్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌.

 

ALSO READ: Qlik Here For The Gallery Of Amyra Dastur