ENGLISH

అనసూయ డ్రీమ్‌ డైరెక్టర్‌ ఎవరంటే!

19 January 2018-16:41 PM

డైరెక్టర్‌ సుకుమార్‌ అంటే తనకి చాలా ఇష్టమంటోంది బుల్లితెర హాటెస్ట్‌ యాంకర్‌ అనసూయ. సినిమాల్లోకి రాకముందే అనసూయకి డైరెక్టర్‌ సుకుమార్‌ అంటే ఇష్టమట. ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాలన్నదే అనసూయ డ్రీమ్‌ అట. అలాంటిది సుకుమార్‌ డైరెక్షన్‌లో సినిమా చేసే అవకాశం ఇప్పుడు 'రంగస్థలం'తో వచ్చింది. 'రంగస్థలం' ఆషామాషీ చిత్రం అస్సలు కాదు. ఇదో ప్రయోగాత్మక చిత్రం. 

చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా సమంత నటిస్తోంది. చరణ్‌కి అత్త పాత్రలో అనసూయ నటిస్తోందంటూ గాసిప్స్‌ వచ్చాయి. అయితే ఆ గాసిప్స్‌ని అనసూయ ఖండించింది. అనసూయది ఈ సినిమాలో కీలక పాత్రట. కానీ ఆ పాత్ర ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. 1985 నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ మన జీవితంలో ఎంత ముఖ్యమైన భాగమైపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి టెక్నాలజీకి దూరంగా ఓ కొత్త లోకంలోకి ఈ సినిమా ప్రేక్షకుల్ని తీసుకెళ్లనుంది. 

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్స్‌ సినిమాపై భారీగా అంచనాల్ని పెంచేస్తున్నాయి. చరణ్‌, సమంత ఇద్దరూ ఇంతకు ముందెన్నడూ కనిపించని పాత్రల్లో కనిపించనున్నారు ఈ సినిమాలో. నేచురాలిటీకి దగ్గరగా లొకేషన్స్‌, సెట్టింగ్స్‌ని పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో డిజైన్‌ చేశాడు డైరెక్టర్‌ సుకుమార్‌. డిఫరెంట్‌ లవ్‌స్టోరీస్‌ని తెరకెక్కించే సుకుమార్‌ ఈ సినిమాతో సరికొత్త లవ్‌స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 1985 కాలం నాటి క్యూట్‌ లవ్‌స్టోరీని సుకుమార్‌ తెరపై ఎలా ఆవిష్కరించాడన్నది త్వరలోనే తెలిసిపోనుంది. మార్చిలో ఈ సినిమా విడుదల కానుంది.

ALSO READ: యాంకర్ ప్రదీప్ కి శిక్ష ఏంటో తెలుసా?