ENGLISH

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో హీరో అరెస్ట్‌

22 September 2017-18:07 PM

తమిళ హీరో జై బుధవారం డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో అరెస్ట్‌ అయ్యారు. స్నేహితులతో కలిసి ఓ స్టార్‌ హోటల్‌లో పార్టీ చేసుకుని మద్యం సేవించారనీ సమాచారం. మధ్యం సేవించి, పార్టీ ముగియగానే స్నేహితులతో కలిసి ఇంటికి బయల్దేరాడు జై. జైతో పాటు హీరో వైభవ్‌, కమెడియన్‌ ప్రేమ్‌జీ ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి పార్టీని ముగించుకుని ఇంటికి వెళుతుండగా, మార్గ మధ్యంలో కారు అదుపు తప్పి, డివైడర్‌ను ఢీకొంది. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న చెన్నై పోలీసులు వారిని పరిశీలించి మధ్యం మత్తులో ఉన్నారనీ గుర్తించారు. మధ్యం మత్తులో కారు నడిపినందుకు జైని అరెస్ట్‌ చేసి, తర్వాత బెయిల్‌పై విడుదల చేశారనీ తెలుస్తోంది. గతంలోనూ జైపై ఇలాంటి కేసు నమోదు అయినట్లు సమాచారం. జై ఫ్రెండ్స్‌ అయిన వైభవ్‌, ప్రేమ్‌జీతో కలిసి దిగిన సెల్ఫీని ప్రేమ్‌జీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ముద్దుగుమ్మ అంజలికి లవర్‌ జై. 'జర్నీ', రాజా రాణి' తదితర చిత్రాలతో జై తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. గత కొంతకాలంగా తెలుగమ్మాయి అంజలి, జైతో పీకల్లోతు ప్రేమలో ఉందనీ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ప్రూవ్‌ అయ్యేలా ఈ జంట సోషల్‌ మీడియాలో ఈ జంట సందడి చేసింది కూడా. తెలుగమ్మాయి అయినా కానీ అంజలికి తమిళంలోనే స్టార్‌డమ్‌ దక్కింది. జైతో లవ్‌లో ఉన్న అంజలి త్వరలోనే పెళ్లి కబురు కూడా చెబుతుందేమో చూడాలిక.

ALSO READ: బుల్లి తెర పై పవన్ కళ్యాణ్ భార్య