ENGLISH

బిగ్ బాస్ గా ఎన్టీఆర్!

29 May 2017-18:27 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం టాప్ హీరోలు ఫాలో అవుతున్న ట్రెండ్ నే అనుసరిస్తున్నాడు. అదే సిల్వర్ స్క్రీన్ నుండి స్మాల్ స్క్రీన్.

 

అందుతున్న తాజా వివరాల ప్రకారం, జూ ఎన్టీఆర్ బిగ్ బాస్ తెలుగు వెర్షన్ కి హోస్ట్ గా చేయనున్నాడు. స్టార్ మా లో ఈ షో ప్రసారం కానుంది. ఇక ఈ షో వ్యాఖ్యాతగా నిర్వహించనున్నందుకు ఈయనకు భారీగానే రెమ్యునరేషన్ ముట్టనుందట. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇదే బిగ్ బాస్ షో హిందీలో పెద్ద సంచలనం అనే చెప్పాలి. సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు హిందీలో 10 సీజన్స్ ని అతను హోస్ట్ చేశాడు. ఇక తమిళంలో కూడా వచ్చే నెలలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ షో కి లోకనాయకుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించానున్నాడట.

 

ALSO READ: ప‌వ‌న్ సినిమాలో మ‌మ్ముట్టి??