ENGLISH

ఐక్లిక్ మూవీస్ టాక్ అఫ్ ది వీక్- ఖాకి, గృహం& స్నేహమేరా జీవితం

19 November 2017-15:37 PM

ఈవారం దాదాపు ఏడు చిత్రాలు విడుదలైన ప్రముఖంగా ఒక మూడు చిత్రాల పైన ప్రేక్షకుల దృష్టి నిలిచింది. అవే- కార్తీ నటించిన ఖాకి, సిద్ధార్థ్ గృహం & శివ బాలాజీ నటించి నిర్మించిన స్నేహమేరా జీవితం.

ఇక ముందుగా నిజజీవితంలో జరిగిన ఒక ఆసక్తికర కేసుని స్పూర్తిగా తీసుకుని చేసిన చిత్రం ఖాకి. కార్తీ పొలిసు అధికారిలో జీవించాడు అనే చెప్పాలి అలాగే దర్శకుడు వినోథ్ కూడా పొలిసు ఇన్వెస్టిగేషన్ విధానాన్ని తెరపైన ప్రేక్షకులకి అర్ధమయ్యేలా చూపెట్టడంలో విజయవంతం అయ్యాడు. ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం కార్తీకి మంచి విజయాన్ని ఇవ్వనుంది అని చెప్పగలం.

లిస్టు లో ఉన్న రెండవ చిత్రం- గృహం. తెలుగు పరిశ్రమకి చాలా గ్యాప్ తీసుకొని మరి ఒక హారర్ చిత్రం ద్వారా వచ్చాడు హీరో సిద్ధార్థ్. అయితే ఈ చిత్రం పైన అతను పెట్టుకున్న విశ్వాసం ప్రేక్షకులు వమ్ము చేయలేదు అనే చెప్పాలి. ఎందుకంటే దర్శకుడు కథ నడిపిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చడం అలాగే ఈ చిత్రానికి రచనా సహకారం కూడా అందించాడు సిద్ధార్థ్. ఎలాగైనా సరే ఒక హిట్ కొట్టాలన్నా సిద్ధార్థ్ కోరిక ఈ గ్రుజం చిత్రం ద్వారా తీరింది అని చెప్పొచ్చు.

మూడవ చిత్రం- శివ బాలాజీ నటించిన స్నేహమేరా జీవితం. ఈ చిత్రం కోసం 80వ దశకం కథాంశాన్ని తీసుకున్న టీం, కథనాన్ని కూడా అప్పటి చిత్రాల తరహాలోనే తీసుకోవడంతో ఈ చిత్రం ఇప్పటి తరం ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇక రాజీవ్ కనకాల, శివ బాలాజీ నటన ఈ చిత్రానికి ప్లస్ అయినప్పటికీ, కథలో పట్టు లేకపోవడంతో ఈ చిత్రం ఆడియన్స్ కి చేరువకాలేకపోయింది.

ఇది ఈ వారం విడుదలైన చిత్రాల పైన మా www.iQlikmovies.com వారి టాక్ అఫ్ ది వీక్.

 

ALSO READ: నారా-కొణిదెల కోడళ్ళ ముచ్చట్లు