ENGLISH

‘నక్షత్రం’కి చుక్కలు కనిపిస్తున్నాయట?!

20 July 2017-13:26 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా చిత్రం నక్షత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాని వచ్చే వారం (జూలై 28) విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు.

అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల కష్టమనే వార్తలు వస్తున్నాయి. దీనికి ఆర్దిక లావాదేవీలే కారణం అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సమయంలో ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడుకులకు ఈ సినిమా గురయింది అని వార్తలు వినపడ్డాయి.

దీనిపై అప్పట్లో దర్శకుడు కృష్ణవంశీ కూడా అలాంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చాడు. కాని ఇప్పుడు మాత్రం నిర్మాతల ఆర్ధిక ఇబ్బందులు ఈ చిత్రం రిలీజ్ తేదీని వాయిదా వేసేలా ఉందంటూ తాజా సమాచారం.

అయితే ఈ చిత్రం విడుదలకి ఇంకొక వారం ఉండడంతో ఏమైనా జరగొచ్చు అని అందరూ అభిప్రాయపడుతున్నారు.

ALSO READ: SIT విచారణ తరువాత నోరువిప్పిన పూరి జగన్నాధ్