ENGLISH

డ్రగ్స్ పైన ‘మా’వారి షార్ట్ ఫిలిం

20 July 2017-13:23 PM

డ్రగ్స్ రాకెట్ లో టాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకి రావడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక ఈ అంశ, పై ‘మా’ ఆధ్వర్యంలో యాంటీ-డ్రగ్స్ పేరిట కొన్ని అవగాహన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగానే, డ్రగ్స్ awareness పేరిట ఒక లఘు చిత్రాన్ని(షార్ట్ ఫిలిం) రూపొందించనున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రముఖ దర్శకుడు ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించనుండగా త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

‘మా’ వారు చేప్పట్టబోయే యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఈ లఘు చిత్ర ప్రదర్శన కూడా ఉండనుంది. ఇప్పటికే ఇండస్ట్రీ పెద్దలు ఈ కార్యక్రమాలని ఎలా రూపొందించాలని అలాగే దీనిలో హీరోలని భాగస్వాములని చేసి తమ తమ అభిమానులకి చేరే విధంగా చూడాలన్నది ‘మా’ ఆలోచన.

యాంటీ డ్రగ్స్ పై లఘు చిత్రం త్వరలోనే రానుందనమాట!

 

ALSO READ: SIT విచారణ తరువాత నోరువిప్పిన పూరి జగన్నాధ్