ENGLISH

‘నాని’ని రిఫర్ చేసిన ‘కింగ్’

20 July 2017-13:20 PM

వరుస హిట్స్ తో దూసుకేలుతున్న నానికి మరొక బంపర్ ఆఫర్ తగిలిందని ఫిలిం నగర్ లో పెద్ద టాక్ నడుస్తున్నది.

వివరాల్లోకి వెళితే, ఒక వైవిధ్యమైన కథతో హీరో నాగార్జునని ఓ కొత్త దర్శకుడు కలిశాడట! ఆ కథ నాగ్ కి బాగా నచ్చిందట అలాగే ఆ కథలోని ఓ ముఖ్యమైన పాత్రకి హీరో నాని అయితే బాగా సరిపోతాడు అని చెప్పినట్టు వినికిడి,

దీనితో సదరు కొత్త దర్శకుడు ఇప్పుడు ఆ కథని హీరో నానికి వినిపించే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. కథ విని ఆ పాత్ర చేయడానికి నాని ఒప్పుకుంటే, ఇక నాగ్-నానిల జంటను వెండితెర పైన చూసే అదృష్టం ప్రేక్షకులకి దక్కనుంది.

సో.. ఈ కాంబినేషన్ త్వరలో వచ్చే అవకాశాలు వచ్చే ఆస్కారం లేకపోలేదు.

 

ALSO READ: నటి కంగనాకు కత్తి గాటు