ENGLISH

నాగార్జున నమ్మకాన్ని నిలబెడతా: ఓంకార్‌

12 October 2017-19:51 PM

నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'రాజుగారి గది - 2'. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌ మీట్‌లో డైరెక్టర్‌ ఓంకార్‌ సినిమా పట్ల తన అభిప్రాయాల్ని మీడియాతో పంచుకున్నాడు. మూడో సినిమాకే తనకి నాగార్జున వంటి స్టార్‌ హీరోతో సినిమా చేయగలిగే అవకాశం దక్కింది. అందుకు కారణం పూర్తిగా నాగార్జున సారేననీ, అందుకు ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాననీ ఓంకార్‌ అన్నాడు. అంతేకాదు కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశారు. ఈ సినిమాలో నేను నటిస్తానని భరోసా ఇచ్చారు నాగ్‌ సార్‌. అలాగే సినిమా ఔట్‌ పుట్‌ ఇంత బాగా రావడానికి నాగార్జున సహకారం పూర్తిగా ఉందన్నారు. నాపై నమ్మకంతో ఈ సినిమాకి ఒప్పుకున్నారు నాగ్‌. ఆయన నమ్మకాన్ని నిలబెట్టే రోజు రానే వచ్చింది. అది రేపే. అంటే ఈ సినిమా రిలీజ్‌ డే. ఖచ్చితంగా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను.. అని ఓంకార్‌ అన్నారు. అలాగే సమంత కూడా ఈ సినిమాకి ఒప్పుకున్నందుకు చాలా సంతోషించాను.. గెస్ట్‌ రోలే అయినప్పటికీ సమంత పాత్ర సినిమాకి చాలా కీలకం. సమంత లేనిదే ఈ సినిమా లేదు.. అని ఓంకార్‌ అన్నారు. సమంత ఈ సినిమాలో ఆత్మగా నటిస్తోంది. నాగార్జున మెంటలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు 'రాజుగారి గది'ని ఇంతటితో వదలను. ఇంకా సీక్వెల్స్‌ చేస్తూనే ఉంటానని ఓంకార్‌ అన్నాడు. ఈ సినిమాలో నాగార్జున, సమంతతో పాటు ముద్దుగుమ్మ సీరత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అశ్విన్‌ బాబు, వెన్నెల కిషోర్‌, ప్రదీప్‌, షకలక శంకర్‌ తదితరులు ఇతర ముఖ్య తారాగణం.

ALSO READ: పొరపాటున #RGG2 కథ చెప్పేసిన సమంతా!