ENGLISH

మగధీర సీక్రెట్స్ చెప్పేస్తాడా?!

27 May 2017-14:13 PM

బాహుబలి తో ప్రపంచాన్ని తన వైపుకి తిప్పుకున్న రాజమౌళి ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అనడంలో ఎటువంటి అనుమానం లేదు.

అయితే తను రేపు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారం కాబోయే ఓ ప్రముఖ ఇంటర్వ్యూ లో రాజమౌళి తన అనుభవాలు పంచుకోనున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేసారు సదరు ఛానల్ వారు.

అందులో ఆయన మగధీర చిత్రానికి ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వలేదు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పినట్టు ఆ ప్రోమో లో ఉంది. అయితే మగధీర విషయంలో రాజమౌళి కొంచెం అసంతృప్తి తో ఉన్నట్టు ఒక పెద్ద రూమర్ ఉంది.

ఇప్పుడు మరి ఆ ప్రశ్నకి ఆయన ఎలాంటి సమాధానం చెబుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ALSO READ: Rarandoi Veduka Chuddam Public Talk