ENGLISH

మెగా హీరో బాగా హర్టయ్యాడు

17 October 2017-20:33 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌కి మేనమామలు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని పాటలను రీమిక్స్‌ చేసే అలవాటుంది. మేనల్లుడిగా వారి సినిమాల్లో సాంగ్స్‌ని రీమిక్స్‌ చేసే హక్కుంది మనోడికి. అందులోనూ మంచి డాన్సరాయె. సో మాస్‌ బీట్‌ ఉన్న సాంగ్స్‌ని రీ మిక్స్‌ చేసి సక్సెస్‌ అయ్యాడు మనోడు. అయితే ఈ విషయంపై సాయి ధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో పలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అదేమీ తప్పు విషయం కాదు కానీ.. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తేజుకు ఎదురైన ప్రశ్న.. మీరు మేనమామల సినిమాలను రీమేక్‌ చేస్తారా? అని. అరదుకు మెగా మేనల్లుడు కొం..చెం నొచ్చుకుని పాటల్ని రీమిక్స్‌ చేసినందుకే నన్ను ఏకి పారేస్తున్నారు. ఇక సినిమాలను రీమేక్‌ చేస్తే ఊరుకుంటారా? అన్నాడు నవ్వేస్తూ.. మళ్లీ వెంటనే ఇన్‌ ఫ్యూచర్‌ చేస్తానేమో కానీ, ఇప్పుడయితే ఆ ఆలోచన లేదన్నాడు తేజు. ప్రస్తుతం తేజు 'జవాన్‌' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. బి.వి.యస్‌. రవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్దుగుమ్మ మెహరీన్‌ కౌర్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క మెగా మాస్‌ డైరెక్టర్‌ వినాయక్‌ దర్శకత్వంలో తేజు హీరోగా ఓ యాక్షన్‌ అండ్‌ పక్కా ఎంటర్‌టైనింగ్‌ మూవీ తెరకెక్కుతోంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. ఇది కాక గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో సినిమాలోనూ తేజు నటిస్తున్నాడు.

 

ALSO READ: వర్మతో స్క్రీన్‌ప్లే రాయిస్తున్న స్వర్గీయ ఎన్టీఆర్‌!