ENGLISH

సాయేషా హాట్‌నెస్‌ హమేషా

18 November 2017-18:37 PM

'అఖిల్‌' సినిమాతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ సాయేషా సైగల్‌. మంచి డాన్సర్‌. పర్‌ఫామెన్స్‌లోనూ మంచి మార్కులే వేయించుకుంది. అక్కినేని బుల్లోడు అఖిల్‌కి సరిజోడీగా ఆ సినిమాలో అందంతో ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా నెగిటివ్‌ రిజల్ట్‌ కారణంగా అమ్మడిని తెలుగులో ఎవ్వరూ పట్టించుకోలేదు. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది ఈ అందాల బొమ్మ. అక్కడ కూడా అమ్మడి అందాల్ని అంతగా పట్టించుకోలేదు. ఒకటీ అరా సినిమాలతో నెట్టుకు రావల్సి వచ్చింది. అయితే తాజాగా తమిళంలో పాగా వేసింది ఈ హాట్‌ బ్యూటీ. తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది. పాండిరాజ్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాతో తమిళంలో మంచి పేరు తెచ్చుకుంటాననీ నమ్మకంగా చెబుతోందీ క్యూట్‌ బ్యూటీ. సినిమాల సంగతి పక్కన పెడితే, సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలతో ఆడియన్స్‌కి దగ్గర కావాలనుకుంటోందట. అందుకే ఇదిగో ఈ ఫోటో చూశారా! ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమేనండోయ్‌. శాంపిల్‌ ఫోటో అయినా ఈ ఫోటోలో క్యూటీ హాట్‌నెస్‌కి కుర్రకారు ఫిదా అయిపోతోందనడంలో అతిశయోక్తి లేదు!

 

ALSO READ: Qlik Here For The Gallery