ENGLISH

సందీప్‌ కిషన్‌ కొత్త కొత్తగా

25 September 2017-15:53 PM

ఇటీవలే 'నక్షత్రం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌. కృష్ణవంశీ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైనా 'నక్షత్రం' ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా 'కేరాఫ్‌ సూర్య' సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సందీప్‌ కిషన్‌ - మెహరీన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'కేరాఫ్‌ సూర్య'. లేటెస్టుగా టీజర్‌ విడుదలైంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్ద పీట వేస్తున్నారు ప్రేక్షకులు. కొత్తగా ఎంటర్‌టైన్‌ చేయడం కావాలి ఆడియన్స్‌కి. అందుకే సరికొత్తగా ఎట్రాక్ట్‌ చేస్తూ, ఎంటర్‌టైన్‌ చేస్తానంటున్నాడు సందీప్‌ కిషన్‌ 'కేరాఫ్‌ సూర్య' ద్వారా. సుశీంద్రన్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సందీప్‌ కిషన్‌ క్యారెక్టర్‌ పేరు 'కామిరెడ్డి సూర్య'. అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు సూర్య. సూర్య క్యారెక్టర్‌ని పరిచయం చేస్తూ గొప్పలు చెబుతూ ఉంటాడు కమెడియన్‌ సత్య. అందుకు రివర్స్‌లో ఉంటాయి మనోడి పనులు. తనకి తానే గొప్పలు చెప్పుకుంటూ, 'రేయ్‌ మామా నేనింత అందంగా ఎలా పుట్టానురా..' అని అంటుంటే, ఇందుకు తన ఫ్రెండ్‌ అయిన సత్య.. 'తూ నా బతుకు.. నేను చచ్చిపోతా..' అనే పంచ్‌ డైలాగ్‌ నవ్వులు పూయిస్తోంది. ఇలాంటి పంచ్‌ డైలాగులు చాలానే సినిమాలో పేలనున్నాయట . లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమాని చిగురుపాటి చక్రి నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల కానుంది.

ALSO READ: 'బిగ్‌బాస్‌' - ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ జర్నీ