ENGLISH

కైపెక్కిస్తోన్న 'గాజు' సుందరి

22 November 2017-14:22 PM

గాజు పెంకులు నేల మీద ఉంటే గుచ్చుకుంటాయేమోనని చెప్పులతో నడుస్తాం. కానీ ఈ ముద్దుగుమ్మ ఏంటి అస్సలు భయమే లేకుండా, గాజులు పొదిగిన దుస్తుల్ని ధరించి, చక్కగా ఫోటోకి పోజిచ్చేసిందే. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనా? అమైరా దస్తూర్‌. గాజు పెంకుల్లో ఈ ముద్దుగుమ్మ అందాలు అదరహో అనిపిస్తున్నాయి. కైపెక్కించే కళ్లతో క్యూట్‌ అండ్‌ హాట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కవ్విస్తోంది. ఇదో వైల్డ్‌ కాన్సెప్ట్‌ ఫోటో సెషన్‌. ఇప్పుడు వైల్డ్‌ కాన్సెప్ట్స్‌కి యూత్‌లో భలే క్రేజ్‌ ఉందిలే. అందుకే ఈ బ్యూటీ ఆ ట్రెండ్‌ని ఫాలో చేస్తోంది. సినిమాల్లోనూ అవకాశాలు బాగానే దక్కించుకుంటోంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'రాజుగాడు' సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. మహేష్‌బాబు సోదరి మంజుల తెరకెక్కిస్తున్న మరో సినిమాలో సందీప్‌కిషన్‌కి జోడీగా నటిస్తోంది. ఓ పక్క సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌, మరో పక్క సినిమాలతో మస్త్‌ బిజీగానే గడుపుతోందీ హాట్‌ బ్యూటీ.

ALSO READ: Qlik Here For The Gallery