ENGLISH

'అ' మూవీ రివ్యూ & రేటింగ్స్

16 February 2018-13:48 PM

తారాగణం: కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజినా, ఈశా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, రోహిణి, మురళి శర్మ, హరితేజ, నాని & రవితేజ నిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమా
సంగీతం: మార్క్ K రాబిన్
ఛాయాగ్రహణం: కార్తీక్
ఎడిటర్: గౌతమ్
నిర్మాతలు: ప్రశాంతి & నాని
రచన-దర్శకత్వం: ప్రశాంత్ వర్మ 

రేటింగ్: 3.5/5

అ- ఈ టైటిల్ విన్నప్పటి నుండి అలాగే ‘అ’ చిత్రానికి సంబందించిన పాత్రల పరిచయం, టీజర్ & ట్రైలర్ వరకు ఈ సినిమా పైన అందరికి అంచనాలని, ఉత్సుకతను పెంచుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కథ విని నిర్మాతగా మారిన నాని ఆ తరువాత దాదాపు 10 మంది వరకు పేరున్న నటులు ఇందులో నటించడానికి ఒప్పుకోవదానికి కారణమైన ఈ ‘అ’ కథేంటో తెలుసుకోవాలన్న కోరిక అందరిలోనూ పెరిగిపోయింది.
మరి ఇంతకి ఈ ‘అ’ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు ‘అ’లరించింది అన్నది ఈ క్రిందటి ‘అ’ చిత్రం సమీక్షలో చదవండి. 

‘అ’ కథ:

కొన్ని కథలు గురించి మనకు సినిమా చూడకు ముందు తెలియకపోతేనే మంచిది. ఎందుకంటే- ఆ కథలో అసలు విషయం మనకి ముందే తెలిస్తే, సినిమా చూసేటప్పుడు ఉండే ఆ ‘కిక్’ పోస్తుంది. ఈ ‘అ’ చిత్రం కూడా అదే కోవలోకి చెందింది. అందుకే ‘అ’ చిత్ర కథ చెప్పడం లేదు. మీరు ధియేటర్ కి వెళ్ళాక ‘అ’ అనాల్సిందే...

నటీనటులు:

కాజల్ అగర్వాల్ , నిత్యా మీనన్, రెజినా,ఈశా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ, దేవదర్శిని, చిన్న పాప పాత్రలు ఈ చిత్రం యొక్క కథలో చక్కగా ఒదిగిపోయాయి. ఇక వీరందరూ బాగా నటించారు అనేదానికంటే, ఈ చిత్ర కథనే వీరితో అలా నటించేలా చేసింది అంటే బాగుంటుంది.

రోహిణి, ప్రగతి & CVL నరసింహ రావు పాత్రలు ప్రధాన తారాగణంకి బాగా తోడ్పడ్డాయి.

విశ్లేషణ:

అన్నిటికంటే ముందుగా ఈ చిత్ర రచయత-దర్శకుడు ప్రశాంత్ వర్మని అభినందించి తీరాల్సిందే. కారణం- ఇటువంటి ఒక కొత్త తరహ చిత్రాన్ని మనకి అందించినందుకు అలాగే నాని, ప్రశాంతిలని కూడా ఈ సందర్భంగా మేచ్చుకోవలిసిందే.

ఒక సున్నితమైన అలగే ప్రస్తుతం మన సమాజంలో చాలా మంది బాధపడుతున్న ఒక అంశాన్ని తీసుకుని దాని చుట్టూ చక్కటి పాత్రలని అల్లడంలో ప్రశాంత్ విజయవంతం అయ్యాడు. మొదటి భాగం మొత్తం పాత్రలని మనకి పరిచయం చేసేస్తాడు ఆ పాత్రలన్నీ ఒక క్రమపద్దతికి రావడంతోనే ‘అంతరాయం’ వస్తుంది. అదే ఇంటర్వెల్.

ఇక రెండవ భాగంలో ఆ పాత్రలు వాటిలో అలాగే వాటి చుట్టూ ఉండే కోణాలని స్పృశిస్తాడు. అసలు ఇదంతా ఏంటి అని అనుకుంటుండగానే దర్శకుడు తాను ఏమి చెప్పాలనుకున్నది అన్నది క్లైమాక్స్ లో ఒక్క స్ట్రోక్ లో చెప్పేస్తాడు. ఇది ప్రశాంత్ వర్మ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు.
ప్రియదర్శి-చేప (నాని)-మొక్క (రవితేజ) ల మధ్య సాగే సన్నివేశాలు-సంబాషణలు రెండవ భాగంలో హాస్యాన్ని పుట్టిస్తాయి.

సాంకేతిక వర్గం:

కార్తీక్ ఛాయాగ్రహణం, ఆర్ట్ విభాగం పనితీరు అద్బుతం అని చెప్పాలి. ఇక వాల్ పోస్టర్ సినిమా వారి నిర్మాణ విలువలు బ్రహ్మాండం...

ప్లస్ పాయింట్స్

+ కథ
+ నటీనటులు
+ ఛాయాగ్రహణం
+ ప్రొడక్షన్ డిజైన్
+ క్లైమాక్స్

మైనస్ పాయింట్స్

- రెండవ భాగంలో కొన్ని సన్నివేశాలు

ఆఖరి మాట: ఇది చూసాక అందరు దర్శకుడి ప్రతిభకి ‘అ’ అనాల్సిందే. మంచి ప్రయత్నం. కథే ఈ సినిమాకి హీరో...

రివ్యూ రాసింది సందీప్

 

ALSO READ: Qlik Here For Awe Movie English Review