ENGLISH

వెండితెరపై ఫట్టు బుల్లితెరపై హిట్టు

04 August 2017-15:05 PM

'గోపాల గోపాల' సినిమాలో గోపిక మాతగా నటించిన బ్యూటీ దీక్షా పంత్‌, పలు తెలుగు సినిమాల్లో కనిపించడానికైతే కనిపించిందిగానీ హీరోయిన్‌గా సత్తా చాటలేకపోయింది. గ్లామరున్నా సక్సెస్‌ ఈమెని వరించక డీలాపడ్డ టైమ్‌లో లక్కీగా 'బిగ్‌బాస్‌' హౌస్‌మేట్‌గా ఛాన్స్‌ కొట్టేసింది. అప్పటిదాకా డల్‌గా సాగుతోన్న బిగ్‌బాస్‌ రియాల్టీ షో, దీక్షా పంత్‌ ఎంట్రీతో కొత్త గ్లామర్‌ సంతరించుకుంది. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తూనే హాట్‌ హాట్‌గా స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగడం, ఆ తర్వాత షోలో చాలా యాక్టివ్‌గా ఉంటూ బుల్లితెర వీక్షకుల్ని అలరించడంతో తక్కువ ఎపిసోడ్లకే బుల్లితెరపై తనదైన సంతకాన్ని చేయగలిగింది ఈ బ్యూటీ. వీకెండ్స్‌లో ఎన్టీయార్‌ మెస్మరైజ్‌ చేస్తోంటే మిగతా రోజుల్లో షో అంతా దీక్షా పంత్‌దే అవుతోంది. ముంబై ముద్దుగుమ్మకి తెలుగు రాదేమో అని అనుకున్నవాళ్ళ అంచనాలు పటాపంచలయ్యాయి. ఆమె తెలుగులో మాట్లాడుతోంది. ముమైత్‌ లాంటోళ్ళతో పోల్చి చూసినా దీక్ష ఆపంత్‌ చక్కటి తెలుగే మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. రియాల్టీ షోలని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వీటితోనే స్టార్స్‌ అయినవారెందరో ఉన్నారు. బాలీవుడ్‌లో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్‌ వేరు. తెలుగులో తొలి సీజన్‌ ఇప్పుడిప్పుడే కొత్త గ్లామర్‌ సంతరించుకుంటోంది. ఏదేమైనా దీక్షా పంత్‌ 'బిగ్‌బాస్‌' షోకి బిగ్‌ ప్లస్‌ పాయింట్‌గా మారిందనడం నిస్సందేహం.

ALSO READ: ప్రభాస్ చెప్పిన సాహో కథ