ENGLISH

దశ మార్చుకున్న 'లోఫర్‌' బ్యూటీ

01 June 2018-16:56 PM

'లోఫర్‌' సినిమాతో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ దిశా పటానీకి తెలుగులో తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. తొలి సినిమానే బోల్తా కొట్టేసరికి అమ్మడిని పెద్దగా పట్టించుకోలేద మన తెలుగు దర్శక నిర్మాతలు. దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ దిశా పటానీ నటించిన 'బాఘీ 2' చిత్రం సూపర్‌ డూపర్‌ విజయం అందుకునే సరికి అమ్మడి దశ తిరిగిపోయిందని భావించారంతా. 

కానీ అంత వెంటనే అక్కడ కూడా దిశా పటానీకి ఆఫర్లు చిక్కలేదండోయ్‌. సినిమాలో ఆఫర్స్‌ సంగతి అటుంచితే, ఈ బ్యూటీకి సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌ మాత్రం చాలా ఎక్కువే. ఆ ఫాలోయింగ్‌తోనే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ఆఫర్లు చేజిక్కించుకుంటోంది అందాల దిశా పటానీ. ఆల్రెడీ తమిళంలో ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ 'సంఘమిత్ర'లో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక హిందీ విషయానికి వస్తే, లేటెస్టుగా కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో దిశాపటానీ ఓ చిత్రంలో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. 

ఈ ఆఫర్‌కే అమ్మడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతోందనుకుంటే, బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ గై హృతిక్‌ రోషన్‌ హీరోగా రోహిత్‌ ధావన్‌ తెరకెక్కిస్తున్న చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా ఎంపికైందనీ వెరీ లేటెస్ట్‌గా అందుతున్న సమాచారమ్‌. అంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మూడు భారీ క్రేజీ ప్రాజెక్టులను చేజిక్కించేసుకుందన్న మాట. 

ఇక ఈ జోరు ఇలాగే ఉంటే, అమ్మడు టాలీవుడ్‌కి అందని ద్రాక్షగా మారిపోతుందేమోననిపిస్తోంది.

ALSO READ: 'రాజుగాడు' తెలుగు మూవీ రివ్యూ & రేటింగ్