ENGLISH

కమల్-నానిల డబల్ ధమాక

02 August 2018-16:59 PM

లోకనాయకుడు కమల్ హాసన్ బిగ్ బాస్ తెలుగులో ప్రత్యక్షంకానున్నారు. అదేంటి ఆయన తమిళ బిగ్ బాస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంటే ఇలా తెలుగు వెర్షన్ కి రావడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా?

ఆయన బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నది తన చిత్రం విశ్వరూపం 2 ప్రచారం కోసమట. ఇప్పటికే బిగ్ బాస్ కి పలువురు నటీనటులు తమ చిత్రాలని ప్రచారం చేసుకునేందుకు వచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగానే ఇప్పుడు కమల్ హాసన్ కూడా ఈ షో లోకి రానున్నారు.

 

దీనితో ఈ వారంతం బిగ్ బాస్ షో ఇంకొంచెం మసాలాతో అదిరిపోతుంది అని మనం ఊహించుకోవచ్చు. బిగ్ బాస్ తెలుగు 2వ సీజన్ మొదలై 50 రోజులు పూర్తవుతున్న తరుణంలో ఇలా డబల్ దమాకగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు సందడి చేయబోతున్నారు.

దీనితో ఈ వీకెండ్ మరింత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని అనుకోవచ్చు.

 

ALSO READ: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన త్రిష.!