ENGLISH

సొగసుల లావణ్యం - ఆహా ఏమి అందం!

10 February 2018-11:01 AM

తొలి సినిమా 'అందాల రాక్షసి' నుంచి కెరీర్‌లో చాలా ఎత్తుపల్లాల్ని చవిచూసిన లావణ్య త్రిపాఠి తాజాగా 'ఇంటిలిజెంట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసారి ఆమెకు నిరాశే ఎదురయ్యింది. సినిమాకి బ్యాడ్‌ టాక్‌ వచ్చినా, లావణ్య గ్లామర్‌కి మాత్రం మంచి మార్కులే పడుతున్నాయండోయ్‌. ఆమె గ్లామర్‌ అలాంటిది. కొంచెం డోస్‌ పెంచి, హీటెక్కించేసింది సిల్వర్‌ స్క్రీన్‌ని 'ఇంటిలిజెంట్‌' సినిమాలో. ఆమె టాలెంట్‌కి తగ్గ సినిమాలు రావడంలేదన్న అభిప్రాయం ఆమె అభిమానుల్లో గట్టిగా విన్పిస్తోంది. తక్కువ కాలంలోనే స్టార్‌డమ్‌ తెచ్చుకున్న లావణ్య, గ్లామర్‌ మీద ఫోకస్‌ పెట్టడం బాగానే ఉందిగానీ, కథల ఎంపికలోనూ ఆ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదేమో. ఈ ఫొటోలో లావణ్య గ్లామర్‌ చూస్తే, ఆ గ్లామర్‌కి తగ్గ స్టార్‌డమ్‌ ఎప్పుడొస్తుందా? అని ఆమెను ఆమే ప్రశ్నించుకున్నట్టుగా వుంది కదా? అనుకోకుండా సక్సెస్‌లు వచ్చిపడ్తుంటాయి, అన్నీ వున్నా సక్సెస్‌లు దోబూచులాడుతుంటాయి. లావణ్య పరిస్థితి ఇప్పుడు అదేనేమో!

ALSO READ: Qlik Here For The Gallery Of Lavanya Tripathi