ENGLISH

రెండో మన్మధుడు ప్యాచ్‌ వర్క్‌లో ఉన్నాడా?

12 July 2019-16:00 PM

ఈ వయసులోనూ ఎంత రొమాంటిక్‌నో కదా! అనిపించుకోవడం బాగానే ఉంటుంది కానీ, మరీ ఈ వయసులో కుర్ర పిల్లలతో అంత రొమాన్స్‌ అవసరమా? అనిపించుకోవడమే అస్సలు బాగోదు కదా! అందుకే నాగార్జున వెనక్కి తగ్గాడట. లేటెస్ట్‌గా నాగ్‌ నటిస్తున్న చిత్రం 'మన్మధుడు 2'. ఈ సినిమాలో రొమాంటిక్‌ రచ్చ ఎలా ఉండబోతోందో ప్రచార చిత్రాల ద్వారా అర్ధమైపోయింది.

 

అయితే, యంగ్‌ హీరోస్‌కి ధీటుగా సీనియర్‌ హీరో నాగార్జున రొమాంటిక్‌ కంటెంట్‌తో వస్తున్నాడే.. అని ఓ వర్గం ఆడియన్స్‌ అనుకుంటుంటే, ఇంకో వర్గం మాత్రం నాగ్‌కి ఇది అవసరమా? అనుకుంటున్నారట. ఆ నోటా ఈ నోటా ఈ మాటలు నాగ్‌ చెవిని చేరడంతో, ఎందుకొచ్చిన రిస్క్‌లే అనుకున్నాడో ఏమో, సినిమాలో రొమాంటిక్‌ టచ్‌ కాస్త తగ్గించాలనుకుంటున్నాడట. టైటిల్‌లోనే 'మన్మధుడు'న్నాడు కాబట్టి నెగిటివిటీ ఉన్నా, సినిమా వచ్చాక ఆడియన్స్‌ శాటిస్‌ఫై అవుతారంటున్నాడట డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌. అయినా ఎందుకో నాగ్‌ వెనక్కి తగ్గుతున్నాడనేది ఫిలిం నగర్‌లో టాక్‌.

 

ఏది ఏమైతేనేం, మొత్తానికి 'మన్మధుడు 2' ప్యాచ్‌ వర్క్‌లో ఉన్నాడనే టాక్‌ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల విడుదలైన అవంతికా టీజర్‌లో రకుల్‌ డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. అంతేకాదు, అవంతికా టీజర్‌లో అవంతికగా రకుల్‌, నాగ్‌ని డ్యామినేట్‌ చేసేస్తోందనే ప్రచారం కూడా జరుగుతోంది. సో 'మన్మధుడు 2'పై జరుగుతున్న ఈ ప్రచారాలు సినిమాకి ప్లస్‌ అవుతాయా.? తెలియాలంటే, ఆగస్ట్‌ వరకూ వెయిట్‌ చేయాల్సిందే బాస్‌.!

ALSO READ: మెగాస్టార్‌ కోసం ఐశ్వర్యారాయ్‌?