ENGLISH

మెగా ఫ్యాన్స్‌కి 'సైరా' గిఫ్ట్‌ ఏంటంటే.!

07 June 2018-13:08 PM

ఆగష్టు 22న మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వాలని మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అనుకుంటున్నాడట. చిరంజీవి 151వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు రామ్‌చరణ్‌. అందుకే ఆ సినిమా నుండి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇవ్వాలనుకుంటున్నాడట చరణ్‌. ఆ రోజు చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా నుండి టీజర్‌, లేదా, ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయాలని చరణ్‌ అండ్‌ టీమ్‌ యోచిస్తోందట.

అయితే 'సైరా'లో చిరంజీవి లుక్‌కి సంబంధించి కొన్ని ఫోటోలు ఆల్రెడీ వచ్చేశాయి. ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆ ఫోటోల్ని తన ట్విట్టర్‌ ద్వారా అఫీషియల్‌గా రిలీజ్‌ చేశాడు. 'సైరా' టైటిల్‌ లోగో కూడా ఆల్రెడీ వచ్చేసింది. అందుకే బెస్ట్‌ గిఫ్ట్‌గా టీజర్‌ రిలీజ్‌ చేయడం బెటర్‌ అనుకుంటున్నారట. టీజర్‌లో కొన్ని సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్స్‌ మిక్స్‌ చేసి విడుదల చేయాలని సైరా టీమ్‌ భావిస్తోందట.

ఒకవేళ అదే చేస్తే మెగా ఫ్యాన్స్‌కి అన్నయ్య నుండి అంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పండి. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోంది. కోలీవుడ్‌ నుండి సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో 'సైరా' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: కాలా' ఓపెనింగ్స్‌ కళ్లు చెదిరేలా?