ENGLISH

నాగశౌర్య అస్సలు తగ్గలేదు సుమీ.!

25 May 2018-12:25 PM

స్టార్‌డమ్‌ విషయంలో రవితేజతో నాగశౌర్యకు పోటీ అని చెప్పలేం. కానీ ఈ మధ్య 'ఛలో' సినిమాతో హిట్‌ కొట్టి పక్కా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు యంగ్‌ హీరో నాగశౌర్య. అయితే రవితేజకు మాత్రం గతంలో స్టార్‌డమ్‌ కౌంట్‌ ఉంది కానీ, ఇప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అసలే లాస్ట్‌ మూవీ 'టచ్‌ చేసి చూడు' సినిమాతో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో రవితేజకు కొంచెం టెన్షన్‌ ఉన్నా, నాగశౌర్య మాత్రం ఫుల్‌ కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్నాడు.

ఈ రోజు ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కాసేపట్లో ఎవరు ముందు, ఎవరు వెనక అనే రిజల్ట్‌ తేలిపోనుంది. ఇక సందడి విషయానికి వస్తే, ఈ రెండు సినిమాలు ప్రదర్శించబడుతున్న ధియేటర్స్‌ వద్ద పండగ వాతావరణమే నెలకొంది. 'నేల టిక్కెట్టు' అంటూ పక్కా మాస్‌ టైటిల్‌ని పెట్టుకుని, మాస్‌ ఆడియన్స్‌ దృష్టి మరల్చకుండా చేశాడు రవితేజ.

అలాగే ప్రమోషన్స్‌ కూడా పక్కా మాస్‌ యాంగిల్‌లోంచే చేసుకొచ్చాడు రవితేజ. ఇకపోతే మన పక్కింటబ్బాయ్‌ నాగశౌర్య కూడా ఏం తక్కువ చేయలేదండోయ్‌. తన యాక్టింగ్‌ ఆటిట్యూడ్‌తో, అమ్మమ్మ సెంటిమెంట్‌తో కట్టిపడేస్తున్నాడు. యూత్‌లోనూ, ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మనోడికి ఉన్న ఫాలోయింగ్‌తో తన సినిమాకి ఆడియన్స్‌ని అలాగే ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు.

ఆల్రెడీ రవితేజను ఒకసారి ఢీకొట్టి గెలవడంతో నాగశౌర్య పక్కా కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. చూడాలి మరి ఓ పక్క క్లాస్‌, మరో పక్క మాస్‌ విజయం ఎవరిదో. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!

ALSO READ: నా వయసు ఆ పాత్రకు సరిపోదు - రామ్‌ చరణ్‌