ENGLISH

శివానీ '2 స్టేట్స్‌' సంగతేంటి బాస్‌.!

21 December 2018-14:15 PM

యాంగ్రీ యంగ్‌మెన్‌గా, యాక్షన్‌ స్టార్‌గా పేరున్న సీనియర్‌ హీరో రాజశేఖర్‌ తనయ శివానీ, '2 స్టేట్స్‌' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మల్టీ టాలెంటెడ్‌ అయిన అడవి శేష్‌ హీరోగా నటిస్తున్నాడు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన '2 స్టేట్స్‌'కి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. అయితే చాలా కాలంగా సెట్స్‌ మీదున్న ఈ సినిమా అప్‌డేట్స్‌ ఏమీ బయటికి రాలేదింతవరకూ. 

 

ఇదిలా ఉంటే, ఈ సినిమా ఆగిపోయిందంటూ తాజాగా గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. క్రియేటివ్‌ విభాగం పరంగా అడవిశేష్‌కీ, డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డికీ మధ్య చిన్న చిన్న తగాదాల కారణంగా తాత్కాలికంగా షూటింగ్‌ నిలిపివేశారనీ ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే అడవిశేష్‌ తన తదుపరి చిత్రం 'గూఢచారి 2' ను కూడా అనౌన్స్‌ చేశాడు. ఈ ఏడాది విడుదలైన 'గూఢచారి' చిత్రం చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌ అందుకుంది. హాలీవుడ్‌ స్థాయి మేకింగ్స్‌తో అందరి దృష్టినీ ఆకర్షించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

 

అందుకే ఈ సినిమాకి సీక్వెల్‌ని అంతకన్నా భారీగా తెరకెక్కించనున్నామని అడవిశేష్‌ పేర్కొన్నాడు. అయితే మరి శివానీ తెరంగేట్రం చేస్తున్న ఈ '2 స్టేట్స్‌' మూవీ సంగతేంటంటే, అవన్నీ జస్ట్‌ రూమర్సేనని సింపుల్‌గా కొట్టి పారేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ సినిమాని పూర్తి చేశాకే, 'గూఢచారి 2' పై దృష్టి పెడతానంటున్నాడీ యంగ్‌ టాలెంటెడ్‌ అండ్‌ హ్యాండ్‌సమ్‌ అడవిశేష్‌.

ALSO READ: రకుల్‌, అఖిల్‌ మధ్యలో నాగ్‌.!