ENGLISH

సుమంత్ మళ్ళీ రావా ట్రైలర్ టాక్

30 November 2017-16:47 PM

అక్కినేని హీరోలలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ చాలా కాలం తరువాత ఒక ఫుల్ లెంగ్త్ లవ్ స్టొరీ- ‘మళ్ళీ రావా’తో మన ముందుకి వస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ప్రేక్షకుల చేత సూపర్ హిట్ అనిపించుకున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ ని సమంతా-నాగ చైతన్యలు విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ చూస్తే- హీరో పేరు కార్తీక్ అవ్వడం, హీరోయిన్ పలుమార్లు కార్తీక్.. కార్తీక్.. అని పిలవడంతో మనకి ఏం మాయ చేసావే సినిమా గుర్తుకురాక మానదు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే, లీడ్ పెయిర్ అయిన సుమంత్ & ఆకాంక్ష సింగ్ లు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఒక ప్రేమ కథకి కావాల్సిన ఫీల్ ఈ ట్రైలర్ లో దర్శకుడు గౌతం చూపెట్టగలిగాడు. సతీష్ కామెరా పనితనం, శ్రావణ్ సంగీతం ఈ ట్రైలర్ ని మరింత బాగుండేలా చేశాయి.

 

ఇక ఈ చిత్రంలో యూత్ ని ఆకట్టుకునే అంశాలు, సన్నివేశాలు చాలానే ఉన్నట్టు ఈ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. చూద్దాం.. మరి వచ్చే 8వ తేదీన ఈ చిత్రం ఎంతమంది ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందో..

 

ALSO READ: Qlik Here For Malli Raava Trailer