ENGLISH

గ్లామ్‌షాట్‌: జూలు మాటున హాట్‌ అందం

17 November 2018-11:40 AM

'మనసుకు నచ్చింది' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ త్రిధా చౌదరికి అందం, అభినయం అన్నీ ఉన్నా అవకాశాలే అరుదుగా అందుతున్నాయి. ఈ ముద్దుగుమ్మ తొలి చిత్రం 'సూర్య వెర్సస్‌ సూర్య'. నిఖిల్‌కి జోడీగా నటించింది. ఆ తర్వాత 'మనసుకు నచ్చింది' సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని ఫీచర్స్‌ ఉన్నాయి. గ్లామర్‌లో నో మొహమాటమ్స్‌. అయినా సోషల్‌ మీడియాలో మెరుపులు మెరిపించేందుకే తన అందాలను పదును పెడుతోంది తప్ప, వెండితెరపై మెరవడానికి అవకాశం రావట్లేదు.

సోషల్‌ మీడియాలో ఈ తళుకుల సుందరి మెరుపులకు మెరిసి ఎవరైనా అవకాశాలిస్తారేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. పిక్‌ చూస్తున్నారుగా. పిక్‌లో ఈ హాటీ కనీ కనిపించని అందాలతో కవ్విస్తోంది. వైట్‌ కలర్‌ షార్ట్‌లో థై సోయగాలు చూపిస్తూ, బ్లాక్‌ కలర్‌ జూలుతో క్లీవేజ్‌ని కవర్‌ చేసేసింది. సన్‌ గ్లాసెస్‌ ఆమె అందానికి మరో ఆకర్షణగా నిలుస్తున్నాయి.

ALSO READ: Qlik Here Tridha Choudhury Latest Gallery