ENGLISH

కట్టప్పా..! ఎందుకీ 'ఎమర్జెన్సీ'.!

06 January 2020-18:30 PM

'కట్టప్ప'గా సత్యరాజ్‌ పేరు యూనివర్సల్‌గా మార్మోగిపోయింది. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.?' అనే ట్యాగ్‌ కూడా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్‌ అయిపోయింది. బాహుబలితో పాటు, అలా కట్టప్ప కూడా మోస్ట్‌ వాంటెడ్‌ పర్సన్‌ అయిపోయాడు. ఇప్పుడీ కట్టప్ప ఎమర్జెన్సీ అంటున్నారు. ఎందుకూ.? ఏమిటీ.? అనే వివరాల్లోకి వెళితే, కట్టప్ప నటించిన తమిళ సినిమాని తెలుగులో 'ఎమర్జెన్సీ' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇంగ్లీష్‌ టైటిల్స్‌తో వస్తున్న సినిమాలు ఈ మధ్య ఆసక్తిని కలిగిస్తున్నాయి. అలాగే కట్టప్ప సినిమా టైటిల్‌ కూడా ఇంగ్లీష్‌లో డిజైన్‌ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ లేటెస్ట్‌గా రిలీజైంది.

 

పోస్టర్‌పై 'ఏ ఫాదర్స్‌ రివేంజ్‌ డ్రామా' అని రాసుంది. అంటే ఇదో థ్రిల్లర్‌ బేస్‌డ్‌ మూవీ అని అర్ధమవుతోంది. ఇక సత్యరాజ్‌ విషయానికి వస్తే, మొన్నీ మధ్యనే 'ప్రతిరోజూ పండగే' సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి స్పీడు మీదున్నాడు. ఆ సినిమాలో తాత పాత్రలో కనిపించిన సత్యరాజ్‌ 'ఎమర్జెన్సీ' కోసం తండ్రి అవతారమెత్తాడు. తండ్రిగా ప్రామిసింగ్‌ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. ఆయనలోని నటున్ని మరోసారి లేటెస్ట్‌ పోస్టర్‌తో బయటికి తీసుకొచ్చారు. ఓ చెక్క కుర్చీలో కూర్చొని తీక్షణంగా చూస్తూ కాస్త అమాయకత్వం నిండిన సీరియస్‌ లుక్స్‌లో సత్యరాజ్‌ కనిపిస్తున్నారు తాజా పోస్టర్‌లో. మరి ఈ తండ్రి రివేంజ్‌ డ్రామా కథా కమామిషు ఏంటనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 'ఎమర్జెన్సీ'ని సమ్మర్‌ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నారు.

ALSO READ: 'మా' వివాదంపై స్పందించిన రామ్‌చరణ్‌!