ENGLISH

పిక్‌ టాక్‌: గోల్డెన్‌ ధగ ధగ, గ్లామర్‌ నిగ నిగ!

06 January 2020-18:00 PM

అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. పిక్‌ చాలా అందంగా ఉంది. ఒంటి నిండా నగలు ధరించి ఏదో జ్యూయలరీ షాప్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్నట్లు బిల్డప్‌ కనిపిస్తోంది పిక్‌ చూస్తుంటే. మెడలో నిండైన నక్లస్‌, చెవులకు వేలాడుతున్న పెద్ద పెద్ద జుంకీలు, పాపిట భారీ బంగారు గొలుసులతో పాటు, చేతికి అందమైన బంగారు గాజులు కూడా ధరించింది. లేత గులాబి రంగు లెహెంగా ధరించింది. టాప్‌లో వేసిన స్లీవ్‌లెస్‌ డిజైనర్‌ టాప్‌ కూడా బంగారంతో పొదిగినట్టే ధగా ధగా మెరిసిపోతూ కనిపిస్తోంది. టోటల్‌గా ఆపాద మస్తకం బంగారంతో నింపేసినట్లుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

ఈ పిక్‌కి నెటిజన్లు 'వావ్‌ గోల్డెన్‌ బ్యూటీ అదిరే అదిరే గోల్డెన్‌ లుక్స్‌ అదిరే..' అంటూ కామెంట్స్‌ పోస్ట్‌ల మీద పోస్ట్‌లు పెడ్తున్నారు. ఈ మధ్య రకుల్‌ పోస్ట్‌ చేసిన పిక్స్‌లో ఇదే బెస్ట్‌ పిక్‌ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నిజమే, ఈ పిక్‌లో గ్లామర్‌ కాస్త తక్కువే ఉన్నా, ప్రామిసింగ్‌గా కెమెరాకిచ్చిన పోజు మాత్రం దిమ్మాక్‌ ఖరాబ్‌ చేస్తోంది. ఇకపోతే, రకుల్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే, తెలుగులో నితిన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. తమిళంలో ఓ సినిమా, బాలీవుడ్‌లో రెండు సినిమాలతో రకుల్‌ బిజీగా ఉంది.

ALSO READ: Rakul Preet Singh Hot Photoshoot