ENGLISH

సోషల్‌ మీడియాపై నయన్‌ హాట్‌ కామెంట్స్‌.!

06 January 2020-16:30 PM

'జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది..' అంటూ అదేదో సినిమాలో హీరో చెప్పిన డైలాగ్‌ మాదిరి తయారయ్యింది నేటి సోషల్‌ మీడియా పరిస్థితి. ఇది ఎవ్వర్నీ వదిలి పెట్టడం లేదు. అందరి డాష్‌ తీర్చేస్తోంది మరి. లేటెస్ట్‌గా సోషల్‌ మీడియాలో వచ్చే పోజిటివ్‌, నెగిటివ్‌ కామెంట్స్‌ పట్ల ముద్దుగుమ్మ నయనతార హాట్‌ కామెంట్స్‌ చేసింది. 2020 జీ తమిళ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో నయనతార రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఫేవరేట్‌ హీరోయిన్‌ కేటగిరిలో ఒకటి, 'నటీమణి శ్రీదేవి' అవార్డుల్ని నయనతార దక్కించుకుంది.

 

ఈ సందర్భంగా, నయన్‌ మాట్లాడుతూ, జీవితంలో సంతోషం ఉంటే సరిపోదు. ప్రశాంతత ఉండాలి. ఆ ప్రశాంతత భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, లేదంటే కాబోయే భర్త వల్ల కానీ దక్కుతుంది..' అంటూ తనకు కాబోయే భర్త గురించి ప్రస్థావించింది. ప్రస్తుతం ఆమె తన ప్రియునితో సంతోషంగా, ప్రశాంతతతో ఉన్నట్లు ఆమె మాటల్లో అర్ధమవుతోంది. ఇక నయన్‌పై సోషల్‌ మీడియాలో వచ్చే కామెంట్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఈ వేదికపై ఆమె సోషల్‌ మీడియా గురించి కూడా ప్రస్థావించింది. సోషల్‌ మీడియాలో నెగిటివిటీ ఎక్కువైపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి నచ్చితే, వారి నుండి మంచి విషయాలు నేర్చుకోండి తప్ప, వారిని విమర్శిస్తూ, తిడుతూ పోస్టులు పెట్టడం సబబు కాదు..' అంటూ నయన్‌ స్వీట్‌గా నెటిజన్స్‌కి చురకలు అంటించింది. ఇకపోతే, ఈ సంక్రాంతికి సూపర్‌ స్టార్‌ రజనీ 'దర్బార్‌' సినిమాతో నయనతార ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Nayanthara Hot Photoshoot