ENGLISH

ఇద్ద‌రూ ఒకే రోజున వ‌స్తారా?

02 January 2020-14:00 PM

సంక్రాంతి రిలీజ్ డేట్ గేమ్ మ‌ళ్లీ మొద‌లైంది. అల వైకుంఠ‌పుర‌ములో కీ, స‌రిలేరు నీకెవ్వ‌రుకీ మ‌ధ్య రేసు మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. జ‌న‌వ‌రి 12న రావాల‌ని స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో అనుకున్న సంగ‌తి తెలిసిందే. అయ‌తే ఇద్ద‌రూ ఓ ఒప్పందానికి వ‌చ్చి స‌రిలేరు 11న‌, అల వైకుంఠ‌పుర‌ములో 12న రావ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. మ‌ధ్య‌లో ఏమైందో తెలీదు గానీ, బ‌న్నీ సినిమా రిలీజ్ డేట్ మారుతుంద‌ని వ‌దంతులు వ‌చ్చాయి. బ‌న్నీ 10నే వ‌స్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే చిత్ర‌బృందం అధికారికంగా ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

 

ఒక వేళ బ‌న్నీ సినిమా 10నే వ‌స్తే, స‌రిలేరు నీకెవ్వ‌రు కూడా 10నే రిలీజ్ అవ్వాల‌నిచూస్తోంద‌ని స‌మాచారం. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తే, అప్పుడు ఫ్రెష్షుగా స‌రిలేరు నీకెవ్వ‌రు కొత్త రిలీజ్ డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం చేతిలో ఉన్న థియేట‌ర్లేంటి? బ‌య్య‌ర్లు ఏమ‌నుకుంటున్నారు? అనే విష‌యాల్ని తెలుసుకునే ప‌నిలో ప‌డింది గీతా ఆర్ట్స్ బృందం. చేతిలో అనుకున్న సంఖ్య‌లో థియేట‌ర్లు ఉండి, బయ్య‌ర్లు సై అంటే.. కొత్త రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాల‌ని చూస్తున్నారు. ఈ రోజు సాయింత్రం క‌ల్లా ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ALSO READ: ద‌ర్శక నిర్మాత ర‌విబాబు `క్ర‌ష్‌`.