ENGLISH

'అల వైకుంఠపురములో..' నుండి టైటిల్‌ సాంగ్‌.!

03 January 2020-15:30 PM

లేటెస్ట్‌గా 'అల వైకుంఠపురములో..' నుండి టైటిల్‌ సాంగ్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఈ నెల 6 వ తేదీన యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ఈ సినిమా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ని గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ ఈ లిరికల్‌ వీడియో రిలీజ్‌ చేశారు. మ్యూజిక్‌ కన్‌సర్ట్‌ కర్టెన్‌ రైజర్‌ వివరాల్ని తెలుపుతూ రిలీజ్‌ చేసిన, 'అల వైకుంఠపురములో..' అంటూ సాగే ఈ లిరిక్స్‌ పోతన భాగవతంలోని ఓ పద్యం. తమన్‌ మ్యూజిక్‌లో ప్రియా సిస్టర్స్‌ ఈ పద్యాన్ని ఆలపించారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' తదితర చిత్రాల్లో ఈ తరహా లిరిక్స్‌ని మనం చూస్తూనే ఉన్నాం. హీరో ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ లిరిక్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేయడం త్రివిక్రమ్‌కి సెంటిమెంట్‌గా వస్తోంది. 'అల..'లోని ఈ లిరిక్స్‌ కూడా అలాగే వస్తాయేమో చూడాలి మరి. ఇంతవరకూ విడుదలైన సాంగ్‌ ప్రోమోస్‌ అన్నీ అదరగొట్టేస్తున్నాయి. ఒకదానికి మించి ఒకటి అనేలా ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో బన్నీ దోశ స్టెప్పు ట్రెండింగ్‌ అయిపోయింది. 'రాములో రాములా..' సాంగ్‌లోని చేతులు తిప్పే స్టెప్‌ని 'దోశ స్టెప్‌'గా అభివర్ణిస్తున్నారు.

ఇంతకీ ఇది దోశ స్టెప్‌ అని రివీల్‌ చేసిందెవరో తెలుసా.? స్వయానా బన్నీ కూతురు అర్హ. నాన్నతో అర్హ టెలిఫోన్‌ ఛాటింగ్‌లో ఈ దోశ స్టెప్పు గురించి ముద్దు ముద్దుగా సంభాషించింది. ఈ క్యూట్‌ సంభాషణను బన్నీ భార్య స్నేహారెడ్డి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో అర్హని చూసి బన్నీ ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. మొన్నా మధ్య 'ఓ ఎమ్‌ జీ డాడీ..' అంటూ సాగే సాంగ్‌ ప్రోమోలో చిన్నారి అర్హ క్యూట్‌ క్యూట్‌గా చేసిన సందడి తెలిసిందే.

ALSO READ: సూరి ఖాతాలో మరో మెగా హీరో!