ENGLISH

సూరి ఖాతాలో మరో మెగా హీరో!

03 January 2020-13:30 PM

ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవితో 'సైరా నరసింహారెడ్డి' వంటి హిస్టారికల్‌ మూవీని తెరకెక్కించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుని, ఆ ప్రాజెక్ట్‌కి పూర్తి న్యాయం చేశాడు స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి. 'సైరా' తర్వాత సూరి చేయబోయే ప్రాజెక్ట్‌పై భారీగా అంచనాలుండడం సహజమే. అయితే, ఇప్పటికే సూరిని మెగా కాంపౌండ్‌లో లాక్‌ చేసేశారనే టాక్‌ వినిపిస్తోంది. ఆ టాక్‌కి బలం చేకూర్చేలా తాజాగా మరో అప్‌డేట్‌ హల్‌చల్‌ చేస్తోంది. 'సైరా' తర్వాత సూరి నుండి రాబోయే చిత్రం మెగా హీరోతోనే ఉండబోతుందనేది ఈ తాజా న్యూస్‌.

 

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కోసం సురేందర్‌ రెడ్డి ఓ స్క్రిప్ట్‌ సిద్ధం చేశారట. పక్కా యాక్షన్‌ ఓరియెంటెడ్‌ స్క్రిప్ట్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ 'బాక్సర్‌' సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్‌ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే సురేందర్‌ రెడ్డి సినిమాపై ఓ క్లారిటీ రానుందేమో. అయినా సురేందర్‌ రెడ్డి అడిగితే, వరుణ్‌ తేజ్‌ కాదనేది లేనే లేదు. ఇక ఇప్పటికే మెగా కాంపౌండ్‌ నుండి సూరి ఖాతాలో మూడు సక్సెస్‌లున్నాయి. అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కాగా, రామ్‌ చరణ్‌తో 'ధృవ', చిరంజీవితో 'సైరా'.. నెక్స్ట్‌ వరుణ్‌ తేజ్‌. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే, వరుణ్‌కీ సురేందర్‌ రెడ్డి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ ఇస్తాడేమో చూడాలి మరి.

ALSO READ: 'మేడమ్‌'తో అనిల్‌ ట్రైల్స్‌ ఇప్పటివి కావట.!