ENGLISH

స్టైలిష్‌ స్టార్‌లో అవే ప్లస్‌ పాయింట్స్‌!

08 January 2020-15:05 PM

కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి అనే రేంజ్‌లో దూసుకొస్తున్నాడు అల్లు అర్జున్‌. వరుస ఫెయిల్యూర్స్‌తో అంచనాల్ని తారు మారు చేస్తున్న అల్లు అర్జున్‌ ఈ సారి పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో వస్తున్నాడు. ఎక్కడా సినిమాకి మైనస్‌ పాయింట్స్‌ క్రియేట్‌ కాలేదు ఇంతవరకూ. అన్ని వైపుల నుండీ పాజిటివ్‌ వైబ్సే వస్తున్నాయి. ముఖ్యంగా సాంగ్స్‌ పరంగా సూపర్‌ హిట్‌ కొట్టేశాడు. ట్యూన్స్‌ దగ్గర నుండి, విజువల్స్‌ వరకూ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ట్రైలర్‌ విడుదలయ్యాక అంచనాలు ఆకాశాన్నంటేశాయి. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. త్రివిక్రమ్‌ టేకింగ్‌, పంచ్‌ డైలాగ్స్‌, క్యారెక్టర్‌ డిజైన్స్‌ అంతా పక్కాగా సెట్‌ అయ్యాయి. అన్నింటికీ మించి ఈ సినిమాకి అల్లు అర్జున్‌ బాగా మారిపోయాడు.

 

'సరైనోడు' సినిమా దగ్గర నుండి అల్లు అర్జున్‌లో ఓ డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌ కనిపించింది. ఎందుకో ఆ ఆటిట్యూడ్‌ని ఫ్యాన్స్‌ అంతగా ఇష్టపడలేదు. కానీ, 'సరైనోడు' సినిమాకి కొట్టుకుపోయింది. కానీ, తర్వాత వచ్చిన 'డీజె', 'నా పేరు సూర్య..' కి వర్కవుట్‌ కాలేదు. దాంతో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుని రంగంలోకి దూకాడు. త్రివిక్రమ్‌ సినిమా కోసం బన్నీ ఇదివరకటి మ్యానరిజమ్‌కి మరిన్ని మెరుగులు దిద్దేశాడు. దాంతో, బన్నీ ఆటిట్యూడ్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. స్టైలిష్‌ స్టార్‌ అంటే ఇదీ.. అనేలా పొగిడి, పొగిడి వదిలిపెడుతున్నారు. డాన్సుల్లో ఈజ్‌, కట్స్‌లో స్టైల్‌ అంతా సూపర్బ్‌గా ఉంది. ఇక సంక్రాంతికి 'అల వైకుంఠపురములో..' అలాంటిలాంటి హిట్‌ కాదు, సెన్సేషనల్‌ బంపర్‌ హిట్‌ ఖాయమంటున్నారు.

ALSO READ: రియల్‌ స్టోరీలో సూర్య!