ENGLISH

డిస్కో స్టార్ గా బన్నీ

27 March 2024-23:18 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మాములుగా లేదు. పుష్ప మూవీతో పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు. నెక్స్ట్ ఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప 2 కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తోంది. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బన్నీ ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పటికే బన్నీ చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్రివిక్రమ్‌, సందీప్ వంగా, అట్లీ, బోయపాటి లాంటి బడా దర్శకుల సినిమాలకి కమిట్ అయిన బన్నీ మొదటగా అట్లీ  సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. 


గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ ఖాతాలో డిజాస్టర్ చేరింది. అందుకే త్రివిక్రమ్ మూవీ కొంతకాలం తరవాత స్టార్ట్ చేసే యోచనలో ఉన్నాడట బన్నీ. సందీప్ వంగా తో సినిమా కూడా ఇప్పుడే అవదు. ఒక వైపు యానిమల్ 2 , ప్రభాస్ స్పిరిట్ సినిమాలతో సందీప్ బిజీ. అందుకని జవాన్ తో భారీ హిట్ కొట్టిన అట్లీ అయితే బెటరని భావించిన బన్నీ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు సమాచారం. ఏప్రిల్ 8న బన్నీ బర్తడే సందర్భంగా అఫీషియల్ గా ఈ మూవీ న్యూస్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం. కథా చర్చలు పూర్తి అయినట్టు, టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.   


ఫిలిం వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీకి ‘డిస్కో స్టార్’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు టాక్.  ఈ టైటిల్ కి కారణం మైఖెల్ జాక్సన్ అని, ఈ మూవీ స్టోరీ ఆయన జీవితాన్ని పోలి ఉంటుంద‌ని కోలీవుడ్ టాక్. ఈ కారణంతో డిస్కో స్టార్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ ఇప్పుడు  డిస్కో స్టార్‌గా మారనున్నాడు. బన్నీ డాన్స్ కున్న క్రేజ్ కి మైకేల్ జాక్సన్ జీవితాన్ని పోలిన కథ అంటే పర్ఫెక్ట్ గా ఉంటుందని ఫాన్స్ ఆనందపడుతున్నారు.