ENGLISH

అఖండ కోసం వ‌స్తున్న ఐకాన్ స్టార్‌

25 November 2021-18:30 PM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం అఖండ‌. డిసెంబ‌రు 2న విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ని ఈనెల‌ 27న హైద‌రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌రు కాబోతున్నాడు. బాలకృష్ణతో అల్లు అర్జున్‌కు మంచి సాన్నిహిత్యం ఉంది. అంతే కాకుండా బోయపాటి శ్రీనుతో అల్లు అర్జున్ సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.

 

మ‌రోవైపు ఆహాలో - బాల‌య్య అన్ స్టాప‌బుల్ అనే పోగ్రాం చేస్తున్నాడు. అందుకే... బ‌న్నీ ఈ ఈవెంట్ కి వ‌స్తున్నాడు. త్వ‌ర‌లోనే బోయ‌పాటి శ్రీ‌నుతో... బ‌న్నీ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ని, దీన్ని గీతా ఆర్ట్స్ నిర్మించ‌బోతోంద‌ని ఓ టాక్ వినిపిస్తోంది. సో.... ఇవ‌న్నీ దృష్టిలో ఉంచుకునే, బ‌న్నీ ఈ ఈవెంట్ కి హాజ‌ర‌వుతున్నాడు. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, ట్రైల‌ర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

ALSO READ: బ‌య్య‌ర్లు మునిగిపోయిన‌ట్టేనా?