ENGLISH

బ‌న్నీ టార్గెట్ ఫిక్స్‌: సుకుమార్ చేతిలో వంద రోజులు

27 December 2021-14:00 PM

టాలీవుడ్ లో మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ లాంటి ద‌ర్శ‌కుడు సుకుమార్‌. ఆయ‌న సినిమాని మ‌రీ చెక్కుతూ పోతుంటాడు. అందుకే సుకుమార్ సినిమాలు ఆల‌స్యం అవుతుంటాయి. పుష్ప కూడా చాలా కాలం సెట్స్‌పైనే ఉండిపోయింది. డిసెంబ‌రు 17న ఎట్టిప‌రిస్థితుల్లోనూ నా సినిమా రావాల్సిందే.. అని బ‌న్నీ ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. సుకుమార్ పార్ట్ 1ని పూర్తి చేయ‌గ‌లిగాడు. ఇప్పుడు పార్ట్ 2 కి సైతం బ‌న్నీ డెడ్ లైన్ విధించాడ‌ని టాక్‌.

 

పుష్ప 2.. వంద రోజుల్లో పూర్తి చేయ‌మ‌ని టార్గెట్ ఫిక్స్ చేశాడ‌ట బ‌న్నీ. పుష్ప 2 కి సంబంధించి కేవ‌లం రెండంటే రెండే సీన్లు తీశారు. ఫిబ్ర‌వ‌రి నుంచి షూటింగ్ మొద‌లు పెట్టాలి. సుకుమార్ ద‌గ్గ‌ర స్క్రిప్టు మొత్తం రెడీగా ఉంది కాబ‌ట్టి... వంద రోజుల్లో సినిమా పూర్తి చేయ‌డం పెద్ద మేట‌రేం కాదు. కాక‌పోతే... థ‌ర్డ్ వేవ్ భ‌యాలు ముంచెత్తుతున్నాయి. లాక్ డౌన్ మ‌ళ్లీ విధిస్తారా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పైగా.. సుకుమార్ ది చెక్కుడు వ్య‌వ‌హారం. తీసిన సీనే మ‌ళ్లీ తీయ‌డం త‌న‌కు అల‌వాటు. పుష్ప 2 కూడా అలా చెక్కుకుంటూ వెళ్తే.. వంద రోజులు కాదు క‌దా, రెండేళ్ల‌యినా సినిమా పూర్త‌వ్వ‌దు. కాక‌పోతే బ‌న్నీ మాత్రం పుష్ప 2 మాత్రం 2022లోనే రావాల‌ని డిసైడ్ అయిపోయాడు. కాబ‌ట్టి... సుకుమార్ ప‌రుగులు పెట్ట‌క త‌ప్ప‌దు.

ALSO READ: చిరుకి అప్పాయింట్మెంట్ దొరికిందా? లేదా?