ENGLISH

RRR ఆప్ష‌న్ అదొక్క‌టేనా?

27 December 2021-17:33 PM

RRR విడుద‌ల మ‌రోసారి సందిగ్థంలో ప‌డింది. నార్త్ లో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న ఉండ‌డం, ఆంధ్రాలో వ‌రుస‌గా థియేట‌ర్లు మూసేస్తుండ‌డంతో... ఈ సినిమాని ఇప్పుడు విడుద‌ల చేయాలా? వ‌ద్దా? అనే డైలామా నెల‌కుంది. RRR లాంటి సినిమాల‌కు సంక్రాంతి కి మించిన సీజ‌న్ ఉండ‌దు. అది దాటితే.. వేస‌వికి రావాల్సిందే. అప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాని హోల్డ్ చేయ‌డం చాలా క‌ష్టం. అలాగ‌ని థియేట‌ర్లు అందుబాటులో లేన‌ప్పుడో, 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధ‌న ఉన్న‌ప్పుడో సినిమాని విడుద‌ల చేయ‌లేరు.

 

అయితే ఈ సినిమా చేతిలో మ‌రో ఆప్ష‌న్ కూడా ఉంది. పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిన సినిమాని విడుద‌ల చేయ‌డం. ఇది నిజంగా రిస్కే. కాక‌పోతే.. కొడితే జాక్ పాట్ కొట్టేయొచ్చు. ఈ సినిమాని ఓటీటీకి అమ్మేసి, పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిన చూపిస్తే.. మంచి రాబ‌డి ద‌క్కించుకోవ‌చ్చు. టికెట్ రేట్ రూ.500 అన్నా స‌రే.. జ‌నం చూసేస్తారు. దాదాపుగా అన్ని భాష‌ల్లోనూ ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. కుటుంబం అంతా క‌లిసి సినిమా చూసే ఛాన్స్ ఉంది కాబ‌ట్టి 500 పెద్ద స‌మ‌స్య కాక‌పోవ‌చ్చు. క‌నీసం కోటిమంది ఈ సినిమా చూసినా 500 కోట్లు... థియేట‌ర్లు లేకుండానే సంపాదించొచ్చు. కాక‌పోతే.. పైర‌సీ బెడ‌ద చాలా ఎక్కువ‌. డూప్లికెట్ ప్రింట్‌, లింకులు వీలైనంత త్వ‌ర‌గాఅందుబాటులోకి వ‌స్తాయి. వాటిని కాపు కాచుకోవ‌చ్చు అనుకుంటే... పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిన సినిమాని విడుద‌ల చేయ‌డ‌మే న‌యం.

ALSO READ: బ‌న్నీ టార్గెట్ ఫిక్స్‌: సుకుమార్ చేతిలో వంద రోజులు