ENGLISH

అభిమాని సాహ‌సం.. బ‌న్నీ ఫిదా

03 October 2020-14:00 PM

ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా 200 కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌. అదీ ఓ హీరో కోసం అభిమాని చేసిన సాహ‌సం. అల్లు అర్జున్ వీరాభిమాని ఒక‌రు మాచెర్ల నుంచి హైద‌రాబాద్ కాలి న‌డ‌క‌న ప్ర‌యాణ‌మ‌య్యాడు. త‌న ల‌క్ష్యం ఒక్క‌టే.. బ‌న్నీని క‌లుసుకోవ‌డం. అది తీరిపోయింది. నాగేశ్వ‌ర‌రావు అనే అభిమాని బ‌న్నీని క‌లుసుకోవ‌డానికి సొంత ఊరు నుంచి హైద‌రాబాద్ 200 కిలోమీట‌ర్లు కాలి న‌డ‌క‌న వ‌చ్చేశాడు. ఆ ప్ర‌య‌త్నానికి బ‌న్నీ ముచ్చ‌ట‌ప‌డి... త‌న‌తో కాసేపు గ‌డిపాడు. ఓ ఫొటో తీయించుకుని, ఇంటికి పంపాడు.

 

నాగేశ్వ‌ర‌రావుది మాచెర్ల‌. బ‌న్నీ అంటే వీరాభిమానం. `అల వైకుంఠ‌పుర‌ములో` హిట్ట‌యితే... శ్రీ‌శైలం కాలిన‌డ‌క‌న వ‌స్తాన‌ని మొక్కుకున్నాడ‌ట‌. లాక్ డౌన్ స‌మ‌యం క‌దా. అందుకే శ్రీ‌శైలం నుంచి - హైద‌రాబాద్ కు రూటు మార్చాడు. ఆరు రోజుల పాటు ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క న‌డుచుకుంటూ బ‌న్నీ ఇంటికి చేరాడు. సోష‌ల్ మీడియా ద్వారా ఈ అభిమాని గురించి తెలుసుకున్న అల్లు అర్జున్‌.. సాద‌రంగా ఆహ్వానించి, కాసేపు ముచ్చ‌టించాడు. ఆ ఫొటోలు ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ALSO READ: ఆచార్య‌తో పాటే వేదాళం కూడా!