ENGLISH

బ‌న్నీ మ‌రో డైరెక్ట‌ర్‌ని ప‌ట్టేశాడు.

04 January 2020-15:15 PM

ద‌ర్శ‌కుల ఎంపిక‌లో అల్లు అర్జున్ చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు. హిట్, ఫామ్, సీరియారిటీ ఇవ‌న్నీ దృష్టి లో ఉంచుకుంటున్నాడు. కావ‌ల్సిన ద‌ర్శ‌కుడు దొర‌క్క పోతే.. సినిమాలు చేయ‌కుండా ఖాళీగా కూర్చుంటున్నాడు గానీ, తొంద‌ర ప‌డి ఒప్పుకోవ‌డం లేదు. ప్ర‌స్తుతం సుకుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ వెంట‌నే మ‌రో స్టార్ ద‌ర్శ‌కుడికి కూడా మాటిచ్చేశాడు. త‌నే మురుగ‌దాస్‌. గ‌జిని, తుపాకీలాంటి సినిమాల‌తో సౌత్‌నే కాదు, బాలీవుడ్ నీ ఆక‌ట్టుకున్నాడు మురుగ‌దాస్‌. మొన్న‌టికి మొన్న స‌ర్కార్‌తో మ‌రో సూప‌ర్ హిట్ కొట్టాడు.

 

ఇప్పుడు ర‌జ‌నీతో ద‌ర్బార్ తీశాడు. ఈ సినిమాపైనా మంచి అంచ‌నాలున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఈ కాంబోపై మురుగ‌దాస్ కూడా క్లారిటీ ఇచ్చాడు. బ‌న్నీతో ఓ సినిమా తీసే అవ‌కాశాలున్నాయ‌ని, ఈ విష‌య‌మై బ‌న్నీతో చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అయితే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్ప‌లేన‌ని అంటున్నాడు మురుగ‌దాస్‌. కాస్త ఆల‌స్య‌మైనా స‌రే, ఈ కాంబోని చూడ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

ALSO READ: మ‌హేష్‌పై యుద్ధానికి బ‌న్నీ రెడీ.