ENGLISH

న్యూ ఇయర్‌లో కొత్త కొత్తగా..!

04 January 2020-14:02 PM

తెలుగు, తమిళ తదితర భాషల్లో హీరోయిన్‌గా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ప్రియమణి గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ, అప్పుడప్పుడూ కొన్ని వెబ్‌ సిరీస్‌లో నటిస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై కొన్ని రియాల్టీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇక ప్రస్తుతం ప్రియమణి సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే కొన్ని క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంది. రానా నటిస్తున్న 'విరాటపర్వం'లో ప్రియమణి ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేస్తోంది.

 

లేటెస్ట్‌గా తమిళ మూవీ 'అసురన్‌' తెలుగు రీమేక్‌లో ప్రియమణి హీరోయిన్‌గా ఎంపికైందంటూ వార్తలు వినిపిస్తుండడంతో, ఈమె పేరు టాలీవుడ్‌లో సోదిలోకి వచ్చింది. వెంకీ హీరోగా, సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఈ ఏడాది మరిన్ని మంచి అవకాశాలు ప్రియమణి తలుపు తట్టేలా ఉన్నట్లు స్వయంగా ఆమె మాటల్లోనే అర్ధమవుతోంది. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'తలైవి' (దివంగత జయలలిత బయోపిక్‌)లో ప్రియమణికి కీలక పాత్ర దక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర మరేదో కాదు, జయలలిత ప్రాణ స్నేహితురాలు, సన్నిహితురాలు అయిన శశికళ పాత్ర అనీ ప్రచారం జరుగుతోంది. ఆ విషయమే ప్రియమణిని అడగ్గా, చెప్పీ చెప్పనట్లుగా సస్పెన్స్‌లో పెట్టింది. కానీ, ఈ ఏడాది తనకు మంచి తరుణమే అని మురిసిపోతోంది. అంటే, కొత్త సంవత్సరం కొత్త ప్రాజెక్టులతో ఆల్రెడీ ప్రియమణి బిజీ అయిపోయిందని అర్ధమవుతోంది.

ALSO READ: Priyamani Latest Photoshoot