ENGLISH

ప్లస్‌, మైనస్‌ ఏదైనా ఒకటే.. అంటోన్న రష్మిక!

04 January 2020-13:05 PM

కొంతమంది ముద్దుగుమ్మలకు సక్సెస్‌ ఉంటేనే మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తుంటాయి. కొందరికి సక్సెస్‌ వచ్చినా అవకాశాలు చిక్కని పరిస్థితి. కానీ, కన్నడ కుట్టీ రష్మికా మండన్నాకి మాత్రం సక్సెస్‌తో సంబంధం లేకుండా వరుస అవకాశాలు ద్కడంతో పాటు, విపరీతమైన క్రేజ్‌ దక్కించుకుంటోంది. కెరీర్‌ మొదట్లోనే మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది రష్మిక. నిజానికి తెలుగులో రష్మిక చేసినవి నాలుగే సినిమాలు. వాటిలో సక్సెస్‌ లిస్టులో ఉన్న మూవీస్‌ రెండే రెండు. అలాంటిది రెండు సక్సెస్‌లకే ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ ఛైర్‌కి పోటీ పడేంతలా రష్మిక దూసుకెళ్తోంది. అయితే, సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనేవి తన దృష్టిలో సమానమే అనీ, ఆ లెక్కల్ని తాను ఎప్పుడూ నమ్మననీ చెబుతోంది.

 

సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమనీ అంటోంది. భాషతో సంబంధం లేకుండా, అన్ని భాషల్లోనూ చేతి నిండా సినిమాలతో బిజీగా గడపాలని రష్మిక కోరుకుంటోంది. కానీ, రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ ఆఫర్‌ రష్మిక తలుపు తడితే, దాన్ని సున్నితంగా తిరస్కరించిందనే రూమర్స్‌ ఉన్నాయి. ఇకపోతే, మాతృభాష కన్నడలో రష్మిక ఎప్పుడూ బిజీనే. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు, తమిళంలో కార్తి సరసన ఓ సినిమాలో నటిస్తోంది రష్మిక. ఈ సంక్రాంతికి విడుదల కాబోయే 'సరిలేరు.' సినిమాపై రష్మిక భారీగా ఆశలు పెట్టుకుంది. ఇంతవరకూ విడుదలైన 'సరిలేరు..' ప్రచార చిత్రాల్లో ఇంతకు ముందు నటించిన సినిమాల్లో కన్నా స్వీట్‌ అండ్‌ క్యూట్‌గా రష్మిక అలరిస్తోంది.

ALSO READ: Rashmika Mandanna Hot Photoshoot