అల్లు అర్జున్ పూర్తి ఫారెస్ట్ బ్యాగ్ డ్రాఫ్ లో చేస్తున్న సినిమా పుష్ప. ఎర్రచందం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే ఈ కధమొత్తం అడవిలోనే జరుగుతుంది. ఇప్పటికి వరకు బయటికి వచ్చిన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ లో అడవి కామన్ గా కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు అడవి ప్రాంతాలలో చేశారు. యూనిట్ మొత్తం అక్కడ నెలలు గడిపింది. అయితే షూటింగ్ కారణంగా అడవిని ఎలాంటి కాలుష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్వయంగా అల్లు అర్జున్ యూనిట్ కి సూచనలు చేశారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో... ‘ఎవరు వినియోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, కప్పుల్ని వారే దయచేసి డస్ట్‌బిన్‌లో వేయండి. మనం ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోదాం’ అని బన్నీ విజ్ఞప్తి చేయడం ఆకట్టుకుంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే నా సామీ పాట సూపర్ హిట్ అయ్యింది. డిసెంబరు 27న విడుదలకానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.
ALSO READ: పుష్ఫకి బూస్టప్ ఇచ్చిన అఖండ