ENGLISH

క్లాప్‌.. కెమెరా..యాక్ష‌న్‌.. పుష్ష‌!

12 October 2020-12:34 PM

`అల వైకుంఠ‌పుర‌ములో`తో ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్టు కొట్టాడు అల్లు అర్జున్‌. ఇండ్ర‌స్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన త‌రవాత‌.. సుకుమార్ తో జ‌ట్టు క‌ట్టాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో `పుష్ష‌` రాబోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు? అనే విష‌యం ఇంత వ‌ర‌కూ తేల‌లేదు. ఆగ‌స్టు త‌ర‌వాత షూటింగ్ ఉంటుంద‌న్నారు. కానీ అక్టోబ‌రు వ‌చ్చినా క‌ద‌లిక లేదు. అస‌లు బ‌న్నీ, సుకుమార్ ల‌కు సెట్ కి వెళ్లే మూడ్ ఉందా, లేదా? అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి.

 

ఎట్ట‌కేల‌కు `పుష్ష‌` సినిమా షూటింగ్ కి అంతా రెడీ అయిపోయింది. న‌వంబ‌రు మొద‌టి వారంలో మారేడు మ‌ల్లి లో ఈ షూటింగ్ ప్రారంభం కాబోతోంద‌ని తెలుస్తోంది. మారేడుమ‌ల్లిలో 100 మంది టీమ్ కి స‌రిప‌డా వ‌స‌తి సౌక‌ర్యాల్ని రెడీ చేస్తున్నారు. షూటింగ్ మొద‌లు కావ‌డానికి వారం రోజుల ముందే టీమ్ స‌భ్యులు క్వరెంటైన్ లో ఉండాలి. ఆ త‌ర‌వాత‌..కోవిడ్ టెస్టులు నిర్వ‌హించి, అప్పుడు షూటింగ్ మొద‌లెడ‌తారు. న‌వంబ‌రు, డిసెంబ‌రు కూడా మారేడుమ‌ల్లిలోనే షూటింగ్ సాగుతుంద‌ని, క‌నీసం 25 శాతం షూటింగ్ ఈ రెండు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని సుకుమార్ భావిస్తున్నాడు.

ALSO READ: ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు క‌న్నుమూత‌