ENGLISH

'మేడమ్‌'తో అనిల్‌ ట్రైల్స్‌ ఇప్పటివి కావట.!

03 January 2020-07:30 AM

లేడీ సూపర్‌ స్టార్‌ విజయ శాంతితో సినిమా చేయాలని అనిల్‌ రావిపూడి ఎప్పటి నుండో అనుకుంటున్నాడట. 'సరిలేరు..'కు ముందు 2019లో అనిల్‌ నుండి వచ్చిన సినిమా 'ఎఫ్‌ 2'. బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. అంతకు ముందే అనిల్‌ ట్రాక్‌ సూపర్‌ హిట్‌గా నడుస్తోంది. ఆయా సూపర్‌ హిట్‌ సినిమాల్లో దేని కోసం విజయశాంతిని ట్రై చేశాడో అనిల్‌ తెలీదు కానీ, ఎప్పటి నుండో విజయశాంతి రీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదంటారు కదా.. ఆ పొగకు కారణమిదే. స్వయంగా విజయ శాంతినే ఈ విషయం బయట పెట్టారు. అయితే, గతంలో అనిల్‌ చెప్పిన కథల కన్నా, 'సరిలేరు..' కథ బాగా నచ్చడంతో ఇక వెంటనే విజయ శాంతి ఒప్పుకోవల్సి వచ్చిందట.

 

అలా 'సరిలేరు..' ప్రాజెక్ట్‌ విజయశాంతి చేతిలోకి వచ్చింది. ఈ సినిమా కథ పూర్తిగా విజయశాంతి చుట్టూనే తిరుగుతుందనడానికి ఇప్పటికే బోలెడన్ని ఎగ్జాంపుల్స్‌ ప్రచార చిత్రాల రూపంలో బయటికి వచ్చేశాయి. ఇక మరి కొద్ది రోజులు మాత్రమే సినిమా విడుదలకు మిగిలి ఉంది. ఆమె సినిమాలకు దూరమై చాలా కాలమే అయినప్పటికీ అభిమానుల్లో ఆమెకున్న క్రేజ్‌ ఎంత మాత్రమూ తగ్గలేదు. ఆ క్రేజ్‌ ఈ సినిమాకి ఖచ్చితంగా ప్లస్‌ అవుతుంది. ఆ నమ్మకంతోనే సినిమా విజయంపై యూనిట్‌ మొత్తం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకే ఈ సంక్రాంతి తనకు వెరీ వెరీ స్పెషల్‌ అని విజయ శాంతి చెబుతున్నారు.

ALSO READ: సారీ.. మా ఆయన చిన్నపిల్లాడు!